cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

జ‌గన్ అంటే భ‌య‌మెందుకో?

జ‌గన్ అంటే భ‌య‌మెందుకో?

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుప‌తి ఉప ఎన్నిక ప్ర‌చారానికి వెళ్తుంటే ప్ర‌త్య‌ర్థుల‌కు ఎందుకంత భ‌య‌మో ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు. వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ గురుమూర్తిని గెలిపించాల‌ని కోరుతూ ఈ నెల 14న తిరుప‌తిలో వైసీపీ నిర్వ‌హించే ర్యాలీ, బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ పాల్గొన‌నున్నారు. ఈ విష‌యం తెలిసినప్ప‌టి నుంచి ఇటు టీడీపీ, అటు బీజేపీ-జ‌న‌సేన కూట‌మి వ‌ణికిపోతున్నాయి.

మెజార్టీ త‌గ్గుతుంద‌నే భ‌యంతో జ‌గ‌న్ ప్ర‌చారానికి వ‌స్తున్నార‌ని బీజేపీ, జ‌న‌సేన ...లేదు లేదు ఓడిపోతామ‌నే ఆందోళ‌న‌తోనే ఆయ‌న ప్ర‌చారానికి వెళ్తున్నార‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. ఇక టీడీపీ క‌ర‌ప‌త్రిక రాత‌లు చ‌దివితే... వామ్మో ఇలా కూడా రాయొచ్చా? అనే అనుమానం క‌లుగుతుంది.

ముఖ్య‌మంత్రి వైఎస్ ప్ర‌చారానికి వెళ్లాల‌నే ఆకస్మిక నిర్ణయానికి.. నిఘా వర్గాల సమాచారమే ప్రధాన కారణమంటూ రాసు కొచ్చారు. స్థానిక ఎన్నికల నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని.. పోటీ గట్టిగానే ఉందని.. ఆయన అనుకున్నట్లుగా అక్కడ ఐదు లక్షల మెజారిటీ వచ్చే అవకాశం లేదని నిఘా వర్గాలు చెప్పినట్లు సమాచారం. 

రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో, తిరుప‌తిలో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు నిర్వ‌హించిన ప్ర‌చార స‌భ‌లు వెల‌వెల పోయాయ‌ట‌, పెద్ద‌గా జ‌నం రాలేద‌ట‌...అంతేకాదు, వైసీపీ అంత‌ర్గత కుమ్ములాట‌లు జ‌గ‌న్‌ను క‌ల‌వ‌ర‌ప‌రిచాయ‌ని ఆ క‌థ‌నం సాగింది.

ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ స్థానిక ఎన్నికల్లో కంటే మెరుగ్గా కనిపించడమూ జగన్‌ ఆలోచనలో మార్పుతెచ్చిం దని ఆ ప‌త్రిక రాసుకొచ్చింది. ప్ర‌తిప‌క్ష పార్టీలు, వాటికి వంత పాడే మీడియా సంస్థ‌ల వికృత చేష్ట‌లు, రాత‌లు ఇలా ఉన్నాయి. 

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డం కంటే ముందు, ఆయ‌న వైసీపీ అధినేత‌. అస‌లు ప్ర‌చారంలో ఎందుకు పాల్గొంటున్నార‌ని ప్ర‌శ్నించడంలోనే ఓట‌మి దాగి ఉంద‌ని తెలుసుకోవ‌చ్చు.

ఎక్క‌డైనా, ఎవ‌రైనా బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి ఉండాల‌ని కోరుకుంటారు. పోటీ అంటే నువ్వా? నేనా? అన్న‌ట్టుగా ర‌స‌వ‌త్త‌రంగా సాగాల‌ని ప్ర‌జానీకం కాంక్షిస్తుంది. తిరుప‌తి ఉప ఎన్నిక ప్ర‌చారంలో విచిత్ర‌మైన ప‌రిస్థితి. 

జ‌గ‌న్ ఒక్క‌రోజు ప్ర‌చారానికి ఎందుకొస్తున్నార‌ని ప్ర‌శ్నిస్తున్న‌వాళ్లు, ఇదే చంద్ర‌బాబు వారం రోజుల పాటు ఎందుకు చేయాల్సి వ‌స్తున్న‌దో చెప్ప‌రు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ఎందుకోసం ప్ర‌చారానికి తెచ్చారో మాట్లాడ‌రు. ప్ర‌తిప‌క్ష పార్టీలు మాత్రం అన్నీ చేసుకోవ‌చ్చు. జ‌గ‌న్ మాత్రం ప్ర‌చారానికి రాకూడ‌దు. ఇదెక్క‌డి వింత వాద‌మో, ఆ మాట్లాడే వారికి, రాసే వారికే తెలియాలి.

పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా

నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను

 


×