Advertisement

Advertisement


Home > Politics - Political News

కరోనా బీజేపీ: కొడాలి మాటల ఆంతర్యమేంటి..?

కరోనా బీజేపీ: కొడాలి మాటల ఆంతర్యమేంటి..?

బీజేపీని రాజకీయ కరోనాగా అభివర్ణించారు మంత్రి కొడాలి నాని. చైనాలో పుట్టిన కరోనా వైరస్ కంటే.. భారత్ లో పుట్టిన ఈ రాజకీయ కరోనా మహా ప్రమాదమని మండిపడ్డారు. ఇటీవల కాలంలో వైసీపీ నేతలు ఈ రేంజ్ లో బీజేపీని ఎప్పుడూ టార్గెట్ చేయలేదు. రాష్ట్రానికే పరిమితం కాకుండా.. దేశవ్యాప్తంగా బీజేపీ ఎలాంటి ప్రమాదకర పార్టీయో చెప్పేశారు నాని. ఇండియాలో పుట్టిన బీజేపీ కరోనా, పశ్చిమ బెంగాల్ లో కమ్యూనిస్ట్, కాంగ్రెస్ ని కలిపి తినేస్తోందని, ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ని మరికొన్ని పార్టీలను ఫలహారం చేస్తోందని అన్నారు. ప్రస్తుతం టీడీపీ కూడా ఈ కరోనా బారిన పడిందని చెప్పుకొచ్చారు.

దీనిపై బీజేపీ ఇప్పటికే కౌంటర్లు మొదలు పెట్టింది. తమ పార్టీని కరోనా అంటూ విమర్శించిన కొడాలిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అసలింతకీ బీజేపీతో కొడాలికి పంచాయితీ ఏంటి? 

ఏపీలో బీజేపీ-వైసీపీ ఒకరి జోలికి ఒకరు రాకుండా సామాజిక దూరం పాటిస్తున్నాయి. అలాంటిది సడన్ గా కొడాలి ఫైర్ అయ్యేసరికి ఆయన ఎందుకలా మాట్లాడారని సొంత పార్టీ నేతలే ఆరా తీస్తున్నారు. తమ పార్టీ ఎంపీని బీజేపీ దగ్గరకు తీసి సీఎం జగన్ పై నిందలేసేలా ప్రోత్సహిస్తోందనేది కొడాలి ఆంతర్యం అయి ఉండొచ్చని అంటున్నారు.

రఘురామ కృష్ణంరాజు ఇటీవల వైసీపీపై తిరుగుబావుటా ఎగరేశారు. అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి రోజూ ఓ ప్రెస్ మీట్ పెట్టి సీఎం జగన్ ని టార్గెట్ చేస్తున్నారు. దీనికి పచ్చపాత మీడియాలో ఫుల్ కవరేజ్ ఉంటోంది. అయితే కేంద్రంలో బీజేపీ అండదండలు ఉండబట్టే ఆయనిలా విచిత్రంగా, చిందరవందరగా ప్రవర్తిస్తున్నారనేది వైసీపీ అనుమానం.

అనుమానం కాదు అది నిజమేననేలా.. వరుసగా కేంద్ర మంత్రుల్ని కలసి ఏవేవో అర్జీలు ఇచ్చి వస్తుంటారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. సొంత పార్టీ కార్యకర్తల వల్ల తనకు ప్రాణభయం ఉందని ఇటీవల సెక్యూరిటీ కూడా పెంచుకున్నారు. ఇది ఆయన ఒక్కరితోనే పోయేలా లేదు. ఏపీలో చాలామంది అసంతృప్త ఎమ్మెల్యేలు, మంత్రి పదవిని అందుకోలేని సీనియర్లు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారనే పుకారూ ఉంది.

పరిస్థితులు అనుకూలించక బీజేపీ సైలెంట్ గా ఉంది కానీ, ఏపీలో వైసీపీ మెజార్టీ బొటాబొటిగా ఉంటే మాత్రం కర్నాటక, మధ్యప్రదేశ్ లో లాగా ఆపరేషన్ కమలం ఇక్కడ కూడా జరిగి ఉండేది. అలాంటి బీజేపీని ఎప్పటికీ నమ్మే ప్రశ్నేలేదంటున్నారు మంత్రి నాని. అందుకే ఆయన బీజేపీపై ఆ స్థాయిలో ఫైర్ అయ్యారు. భారత కరోనాగా అభివర్ణించారు.

ఈ గడ్డంతో నిద్ర పట్టట్లేదు

మెగాస్టార్ గురించి మీకు తెలీదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?