Advertisement

Advertisement


Home > Politics - Political News

రఘురామకు ఎందుకంత సీన్ ఇస్తున్నారు..!

రఘురామకు ఎందుకంత సీన్ ఇస్తున్నారు..!

రఘురామకృష్ణంరాజు వైసీపీ గుర్తుపై గెలిచిన ఓ ఎంపీ. అయితే ఒక్కసారి గెలుపు రుచి మరిగిన తర్వాత పార్టీ కంటే తానే పెద్దోడ్ని అనుకున్నారాయన. పక్కనచేరి రెచ్చగొట్టేవారి మాటలు విని రెచ్చిపోయారు, ఆ తర్వాత సీఐడీకి చిక్కిపోయారు. కట్ చేస్తే.. సీఐడీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అంటూ.. బెయిల్ కోసం చాలా ప్రయత్నాలు చేసి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. అక్కడితో ఆయన సీన్ క్లోజ్.

ఆ తర్వాత ఆయన ఎంత గింజుకున్నా వినేవారు ఉండరు, పట్టించుకునేవారు ఉండరు. రాగా పోగా టీడీపీ అనుకూల మీడియా.. తమకు అవసరం కాబట్టి సదరు, రాజు వ్యాఖ్యల్ని హైలెట్ చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలుపుతోంది. మరి సాక్షికి ఏమవసరం వచ్చింది. సాక్షిలో ఎందుకు రఘురామ వార్తలకు అంత ప్రాధాన్యం దక్కుతోంది.

టీడీపీ అనుకూల మీడియా నెత్తికెత్తుకుంది అంటే దానికో అర్థం ఉంది. సాక్షి కూడా ఆ ట్రాప్ లో పూర్తిగా పడిపోయింది. సీఎం జగన్ గురించి ఎన్ని వార్తలొస్తున్నాయో.. రఘురామకృష్ణంరాజు నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు కూడా అంతే ప్రాధాన్యమిస్తూ అన్ని వార్తలు ఇస్తోంది సాక్షి. ఆయన తిట్టే తిట్ల గురించి, ఆయన్ని తిట్టేవారి గురించి ఒక్క వార్త కూడా మిస్ కాకుండా ఇచ్చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా కూడా రఘురామ పేరుని తలచుకోని రోజు లేదంటే అతిశయోక్తి కాదు.

ఎందుకిదంతా..? రఘురామని పెంచి పోషిస్తోంది ఎవరు? ఆయనకు, ఆయన వార్తలకు అనవసర ప్రాధాన్యం ఇస్తూ పెద్దోన్ని చేస్తోంది ఎవరు? ఎందుకు..?

ఇగ్నోరెన్స్ ఈజ్ ది బెస్ట్ మెడిసిన్..

రఘురామ జాతి నాయకుడు కాదు, జాతీయ నాయకుడు అంతకంటే కాదు. కనీసం సొంత సామాజిక వర్గం కూడా ఆయన్ను తమ నాయకుడిగా గుర్తించడం లేదు. సొంత నియోజకవర్గం ప్రజలు కూడా ఛీకొట్టారు, చీత్కరించుకుంటున్నారు. ఇక మిగతా ప్రాంతాల్లో క్రేజ్ ఉండేందుకు ఆయనేమీ గొప్ప వక్త కాదు, సమకాలీన రాజకీయాలు తెలిసిన వ్యక్తి అంతకంటే కాదు. 

ఎవరో రాసిచ్చిన మేటర్ చదువుతూ తనకి తాను అపర మేధావిలా ఫీలయ్యే రకం. అలాంటి వ్యక్తిని అనవసరంగా హైలెట్ చేస్తూ సాక్షి రాంగ్ ట్రాక్ లోకి వెళ్తోంది. పదే పదే వైసీపీ నేతలు కూడా ఆయన వ్యవహారాన్ని ప్రస్తావించడం కూడా పార్టీకి మంచిది కాదనే విషయం గ్రహించాలి.

సాక్షాత్తూ తనపై తప్పుడు ప్రేలాపనలు పేలినా.. సీఎం జగన్ చూసీ చూడనట్టున్నారు, తన పని తాను చేసుకుంటూ, చట్టం పని చట్టం చేసుకునేలా పోతున్నారు. మధ్యలో మీడియానే రఘురామకు స్థాయికి మించి కవరేజ్ ఇస్తూ పెద్దోడ్ని చేస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?