Advertisement

Advertisement


Home > Politics - Political News

జగన్ చెవిలో జోరీగలు.. ఈ ఇద్దరు సీనియర్లు!

జగన్ చెవిలో జోరీగలు.. ఈ ఇద్దరు సీనియర్లు!

వైఎస్ఆర్ మంత్రివర్గంలో వారిద్దరూ కీలక శాఖలను నిర్వహించారు. మంత్రులుగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. కానీ జగన్ టీమ్ లో మాత్రం ఆ ఇద్దరికీ చోటు లేదు. కారణాలేవైనా సీనియర్ నేతలు, మాజీ మంత్రులు.. ఆనం రామనారాయణ రెడ్డి, ధర్మాన ప్రసాదరావుని కేబినెట్ కి దూరంగానే ఉంచారు జగన్. 

బహుశా రెండో దఫా కూడా వారికి అవకాశం లేదని ఈ పాటికే తేలిపోయినట్టుంది. దీంతో ఒకరకంగా స్వపక్షంలోనే విపక్షంలా తయారయ్యారు ఆ ఇద్దరు.

చెడు చెవిలో..

ఈ సూక్తి ఎప్పటి నుంచో ఉంది. నవరత్నాల కోసం వేల కోట్లు ఖర్చుపెడుతున్న నేపథ్యంలో  కొన్నిచోట్ల ఇబ్బందులు తప్పవు. అయితే వాటిని చెవిలో చెప్పకుండా మైకులో చాటింపేస్తున్నారు. పచ్చ మీడియాను ముందు పెట్టుకుని, పనిగట్టుకుని మరీ టముకేస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక, సిమెంట్, స్టీల్ రేట్లు పెరిగాయని, ప్రభుత్వ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారనేది ధర్మాన వాదన. పరువు కోసం పనులు తీసుకున్నవారు కష్టపడుతున్నారని చెబుతున్నారాయన.

మరి ఇక్కడ ప్రజలకు వచ్చిన ఇబ్బంది ఏంటి..? కాంట్రాక్టర్లు ఎల్లకాలం లాభాలు కళ్లజూడాలనుకోరు. ప్రతి పని లోనూ కోట్లు వెనకేసుకోవాలనుకోరు. ప్రభుత్వం ఇచ్చిన రేట్లకు, మార్కెట్ రేట్లకు కొన్నిసార్లు వ్యత్యాసం ఉన్నా కూడా పనులు చేయాల్సి వస్తుంది. ఆ గుడ్ విల్ నిలుపుకోగలిగితేనే భవిష్యత్తు బాగుంటుందనేది వారికి కూడా తెలుసు. మరి ధర్మాన లాజిక్ ఏంటో అర్థం కావడంలేదు. 

ఇక అధికారులు జగన్ కి తప్పుడు సలహాలు ఇవ్వొద్దని కూడా ధర్మాన హితవు పలికారు. మరి మంచి సలహాలేంటో ధర్మాన చెబితే బాగుంటుంది.. అవి కూడా నేరుగా వెళ్లి జగన్ కు చెబితే ఆయన కాదంటారా..? నిజంగా మంచి చేయాలనుకుంటే ఇలా మీడియా ముందు రంకెలేయాలా..? లేదా పార్టీ మీటింగ్ లో చర్చించకూడదా..?

ఆనం తక్కువ తినలేదు..

ఆ మధ్య నెల్లూరు నగరంలో పట్టుకోల్పోతున్నామనే బాధతో.. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని పరోక్షంగా విమర్శించారు ఆనం రామనారాయణ రెడ్డి. ఆ తర్వాత జిల్లా జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశాల్లో కూడా వివిధ పథకాలకు నిధులు సరిగా విడుదల కావడంలేదని, అధికారులు ఏంచేస్తున్నారని ఆయన బహిరంగ విమర్శలు చేశారు. జగనన్న ఇళ్ల కాలనీల నిర్మాణానికి వెంట వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 

జగనన్న కాలనీల విషయంలో ఓవైపు ప్రతిపక్షాలు, మరోవైపు కోర్టు కేసులతో ప్రభుత్వం సతమతం అవుతుంటే.. మరోవైపు ఆనం అలా మాట్లాడటంతో అందరూ షాకయ్యారు. అప్పటినుంచి అవకాశం వచ్చినప్పుడల్లా అలా షాకులమీద షాకులిస్తూనే ఉన్నారు ఆనం. ఇప్పుడు ధర్మాన కూడా తోడయ్యారు. ఈ మాజీ మంత్రులిద్దరూ ఇలా తోడు తోడుగా.. జగన్ కు చెవిలో జోరీగల్లా మారారు.

ఈ టైపు బ్లాక్ మెయిలింగ్ వర్కవుట్ అవుద్దా..!

జగన్ దగ్గర ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు వర్కవుట్ అవ్వవనే విషయం అందరికీ తెలిసిందే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రఘురామ ఉదంతం. వైసీపీకి వ్యతిరేకంగా విమర్శలు చేసిన వెంటనే జగన్ తనను పిలిచి బుజ్జగిస్తారని రఘురామ కలలుకన్నారు. కానీ ఏం జరిగిందో అంతా చూస్తున్నాం. ఇప్పుడు ధర్మాన, ఆనం లాంటి నేతలు మీడియాకెక్కి ఏదో సాధిద్దాం అనుకుంటే అది వాళ్ల భ్రమే అవుతుంది. 

ఇలా మీడియా ముందు విమర్శలు చేస్తే మంత్రి పదవి వస్తుందనో, లేదంటే రాబోయే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ వస్తుందనో భావిస్తే అంతకంటే అమాయకత్వం ఇంకోటి ఉండదు. కేవలం ఎల్లో మీడియాకు మేత అందించడం మినహా, వీళ్ల విమర్శలు జగన్ సర్కార్ ను ఇరుకున పెట్టలేవు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?