Advertisement

Advertisement


Home > Politics - Political News

బడా బాబులతో సెక్స్.. తర్వాత బ్లాక్ మెయిల్

బడా బాబులతో సెక్స్.. తర్వాత బ్లాక్ మెయిల్

అమ్మాయితో శృంగారంలో పాల్గొని సీక్రెట్ గా వీడియోలు, ఫొటోలు తీసి వాటితో అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన ఘటనలు ఇదివరకు చాలానే చూశాం. మరి ఇదే సీన్ రివర్స్ అయితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి ఘటనే తెలంగాణలోని పాల్వంచలో జరిగింది. బడా బాబులతో సెక్స్ చేసి, సీక్రెట్ గా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది ఓ మహిళ.

కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఓ మహిళ బరితెగించింది. జిల్లాలోని కొంతమంది బడా బాబులతో శృంగారం చేసి ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది. చూడ్డానికి అందంగా ఉంటుంది. దేనికైనా రెడీ అంటూ కవ్విస్తుంది. దీంతో కొంతమంది బడా బాబులు ఈమె వలలో పడ్డారు.

పాల్వంచలోని టీచర్స్ కాలనీకి చెందిన ఈ మహిళ.. అలా ఇప్పటివరకు 10 మందిని వలలో వేసుకుంది. వాళ్లతో సెక్స్ చేసిన వీడియోల్ని, వాళ్లకే చూపించి బ్లాక్ మెయిల్ చేసింది. అడిగినంత ఇవ్వకపోతే వీడియోలు రిలీజ్ చేసి పరువు తీస్తానని, పోలీస్ కేసు కూడా పెడతానంటూ డబ్బులు గుంజింది. పరువు పోతుందని భావించి చాలామంది ఈమెకు లక్షల్లో సమర్పించుకున్నారు.

శాస్త్రి రోడ్డుకు చెందిన ఓ చిన్న వ్యాపారిని కూడా ఇలానే బెదిరించింది సదరు మహిళ. 10 లక్షలు ఇవ్వాలని, లేదంటే అతడితో శృంగారం నెరిపిన వీడియోల్ని బయటపెట్టి పరువు తీస్తానని బెదిరించింది. అయితే అంత డబ్బు లేకపోవడంతో సదరు వ్యాపారి పోలీసుల్ని ఆశ్రయించాడు.

డబ్బు ఇస్తాం రమ్మంటూ వల పన్నిన పోలీసులు.. మహిళతో పాటు మరో ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. మహిళ దగ్గరున్న ఫోన్లు, డాటాకార్డులు స్వాధీనం చేసుకున్నారు. వాటి నిండా బడా బాబులతో సదరు మహిళ సెక్స్ చేసిన వీడియోలున్నాయి.

కాపుల మధ్య కుల రాజకీయం

నందిగం సురేష్ ఫైర్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?