cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

10 రోజుల్లో పెళ్లి.. కరోనాతో మృతి

10 రోజుల్లో పెళ్లి.. కరోనాతో మృతి

దేశంలో కరోనా సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. లక్షలాది కుటుంబాల్లో చిచ్చుపెడుతోంది ఈ మహమ్మారి. అలాంటిదే ఓ బాధాకరమైన ఘటన హైదరాబాద్ లో జరిగింది. మరో 10 రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన అమ్మాయి, అర్థాంతరంగా తనువు చాలించింది. నిండు జీవితాన్ని కరోనా కబలించింది.

హైదరాబాద్ లోని ఉప్పల్ లో నివాసం ఉంటున్న ఓ యువతికి పెళ్లి సెటిలైంది. కరోనా ఉధృతి ప్రారంభం కాకముందే వివాహం కుదిరింది. కరోనా వల్ల పెళ్లిని వాయిదావేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈనెల 13న పెళ్లి చేయాలని ముహూర్తం నిర్ణయించారు. ఆ మేరకు షాపింగ్ కూడా పూర్తిచేశారు.

ఈ క్రమంలో గత నెల 21న యువతికి కరోనా సోకింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. దాదాపు 10 రోజుల పాటు చికిత్స పొందుతూ, కరోనాతో పోరాడి ప్రాణాలు కోల్పోయింది ఆ యువతి. మరో 10 రోజుల్లో పెళ్లి ఉందనగా, ఇలా కరోనా ఆమెను కబలించింది.

ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా లెక్కలేనన్ని జరుగుతున్నాయి. నిన్నటికినిన్న శ్రీకాకుళం జిల్లాలో ఓ యువతి, కరోనా కారణంగా తండ్రిని కోల్పోయింది. అతడి దగ్గరకు కూడా వెళ్లడానికి ఎవ్వరూ సాహసం చేయలేదు. కూతురు మాత్రం ప్రేమతో తండ్రి దగ్గరకు వెళ్లింది. అతడికి నీళ్లు తాగించింది. ఆ తర్వాత కొద్ది సేపటికే తండ్రి మరణించాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే కరోనా వెతలు కోకొల్లలు. బెంగళూరులోని ఓ స్మశాన వాటికకు హౌజ్ ఫుల్ బోర్డు తగిలించారంటే కరోనా ఉధృతి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×