Advertisement

Advertisement


Home > Politics - Political News

అమరావతికి ప్రపంచబ్యాంక్ షాక్, మంచిదేనా?

అమరావతికి ప్రపంచబ్యాంక్ షాక్, మంచిదేనా?

వాళ్లు ఇస్తామన్నది ఉచిత నిధులు ఏమీకాదు. అప్పే! కాబట్టి దాన్ని ఇవ్వమని నిరాకరించడం ద్వారా రాష్ట్రానికి మరీ మునిగిపోయేది ఏమీ లేదని చెప్పవచ్చు. 7,200 కోట్ల రూపాయల అప్పును రెండు విడతల వారీగా ఇవ్వడానికి మొదట ఓకే  చెప్పిన వరల్డ్ బ్యాంకు ఇప్పుడు అందుకు పూర్తిగా నిరాకరించినట్టుగా ప్రకటించింది.

దీనివెనుక అసలు కథ ఏమిటి? అంటే రెండు వెర్షన్ లు వినిపిస్తున్నాయి. అందులో మొదటిది.. అమరావతి విషయంలో వెళ్లిన ఫిర్యాదులు. మూడు పంటలు పండే భూమిని అక్కడ రైతుల నుంచి తీసుకుని అభివృద్ధి పేరుతో వ్యవసాయం జరగకుండా చూస్తున్నారని రైతులు ఫిర్యాదు చేశారు. కొన్ని ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ విషయంలో వరల్డ్ బ్యాంక్ కు కంప్లైంట్ చేశాయి.

ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు తెచ్చి అమరావతి నిర్మించాలి అనేది చంద్రబాబు నాయుడి ప్రణాళిక. అందుకే రైతులు, స్వచ్ఛంద సంస్థలు వరల్డ్ బ్యాంక్ కే ఫిర్యాదు చేశాయి. నగరీకరణకు అప్పులు ఇవ్వడంలో వరల్డ్ బ్యాంక్ కొన్ని నియమాలు పెట్టుకుంది. పచ్చని ప్రాంతాన్ని అభివృద్ధి పేరుతో ముక్కలు చెక్కలు చేయడానికి వరల్డ్ బ్యాంక్ డబ్బులు ఇవ్వదు. అందుకే ఆ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని అప్పుకు నో చెప్పిందనేది ఒక వెర్షన్.

మరో సంగతేమిటంటే.. అమరావతిలో ముందస్తు తనిఖీలు చేసి రుణం ఇవ్వాలని వరల్డ్ బ్యాంక్ అనుకుందట. అయితే అలాంటి తనిఖీలకు అనుమతులు ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వం ఏపీకి చెప్పిందట. అలా ముందస్తు తనిఖీలు తర్వాత అప్పు అనే పరిస్థితి వస్తే దేశంలోని అనేక ప్రాజెక్టులకు ఇబ్బంది ఏర్పడుతుందని కేంద్రం సూచించిందట. అందుకే ఏపీ ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ అధికారుల తనిఖీలకు అవకాశం ఇవ్వలేదని, దీంతోనే అప్పు నిలిచిపోయిందని కూడా వార్తలు వస్తున్నాయి.

ఏదేమైనా నిలిచిపోయినది అభివృద్ధి కోసం అంటూ ఇస్తున్న ఉచిత నిధులు కాదు. వడ్డీలకు ఇచ్చే అప్పులు. అప్పుచేసి పప్పుకూడుతో ఎంతవరకూ లాభం ఉంటుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి అప్పు ఆగిపోవడం కూడా ఒకందుకు మేలేనేమో! ఈ విషయంలో జగన్ ప్రభుత్వం కూడా పెద్దగా ఫీలయ్యే అవకాశాలు కనిపించడంలేదు.

పూరి ఇంటర్వ్యూలో చెప్పినట్లే సినిమా ఉందా?

అమలాపాల్ తన బాయ్ ఫ్రెండ్ గురించి ఇలా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?