cloudfront

Advertisement


Home > Politics - Political News

టీడీపీకి తలనొప్పిగా మారిన ‘యాత్ర’ సక్సెస్!

టీడీపీకి తలనొప్పిగా మారిన ‘యాత్ర’ సక్సెస్!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసి పెట్టిన అనేక కార్యక్రమాలను అడ్డం పెట్టుకుని ప్రచారం పొందుతూ ఉంది తెలుగుదేశం పార్టీ. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకుంటున్న చాలా పథకాలకు ఆద్యులు వైఎస్ అని వేరే చెప్పనక్కర్లేదు కూడా.

ఈరోజు భారీఎత్తున పెన్షన్లను ఇస్తున్నట్టుగా బాబు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఆయన రెండువేల నాలుగు వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చినది డెబ్బై ఐదురూపాయల పెన్షనే. అది కూడా కేంద్రప్రభుత్వ ప్రాయోజితం. ఊరికి ఐదారు మందిని ఎంపిక చేసి పెన్షన్లు ఇచ్చారు. ఎవరైనా చనిపోతేనే లిస్టులో కొత్త వారి పేరును యాడ్ చేసే దుర్మార్గపు విధానాన్ని అమలు చేసింది చంద్రబాబు నాయుడి ప్రభుత్వమే!

ఆ తీరును వైఎస్ మార్చారు. అధికారంలోకి వచ్చీ రాగానే... పెన్షన్లను, గృహనిర్మాణాన్ని, రేషన్ కార్డులను అడిగిన వారికి, అడగని వారికి కూడా ఇచ్చింది వైఎస్ ప్రభుత్వం. బాబు హయాంలో ఇళ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు.. అందరికీ ఇచ్చిందిలేదు. ఆ లోటును పూర్తి చేసి కొత్త ట్రెండ్ సృష్టించారు వైఎస్. అలాంటి సంక్షేమ కార్యక్రమాలే ఆయనను రెండోసారి విజయం సాధించగలిగేలా చేశాయి.

ఇక గత టర్మ్ లో అనేక సమీకరణాల మధ్యన అధికారం సొంతం చేసుకున్నాకా.. చంద్రబాబు నాయుడు వైఎస్ పథకాలనే కొనసాగించారు. వాటికి పచ్చ పేర్లను మాత్రం పెట్టుకున్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీని ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చారు. ఇందిరమ్మ గృహకల్పనకు ఇంకో పేరు పెట్టారు.

వన్ నాట్ ఎయిట్ కు మాత్రం పేరు మార్చలేకపోయారు. ఇక ఈరోజు చిత్తూరుకు నీళ్లిచ్చాం అని ఎన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వం డప్పు కొట్టుకుంటోంది. కియా పేరు చెప్పుకుంటోంది. ఒకవేళ వైఎస్ చొరవ చూపకపోయి ఉంటే, ఈ హంద్రీనీవా చిత్తూరు వరకూ సాగేదీకాదు, ఈ ప్రాజెక్టు వాటర్ సోర్స్ ఆధారంగా కియా పరిశ్రమ ఏర్పడేది కాదు. ఇదంతా చరిత్ర. చెరిపితే చెరిగిపోదు. కాసేపు మరుగున పడొచ్చు అంతే.

ఇలాంటి మరుగునపడిన విషయాలను ఎవరో ఒకరు గుర్తుచేస్తూ ఉంటారు. ఇప్పుడు ‘యాత్ర’ సినిమా కూడా అలాగే ఉంది. వైఎస్ మానన పుత్రికలు అయిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాల ఆలోచనల గురించి ‘యాత్ర’ వివరిస్తోంది.

ప్రజారంజకమైన, ప్రజలకు అత్యంత ఉపయుక్తమైన ఈ పథకాల పితామహుడు వైఎస్సార్ ఆని ఘనంగా చెబుతోంది ‘యాత్ర’ సినిమా. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీకి ఇది తలపోటు విషయమే.

రాజకీయంలో డబ్బే డబ్బు.. ఇదే రాజకీయ సిద్ధాంతం..!

వైఎస్సార్ డైలాగ్స్ పబ్లిక్ చెప్తే.. ఆ కిక్కే వేరప్పా