cloudfront

Advertisement


Home > Politics - Political News

వైసీపీ గాలివీస్తోంది: మళ్ళీ గెలిచిన గోరంట్ల మాధవ్‌

వైసీపీ గాలివీస్తోంది: మళ్ళీ గెలిచిన గోరంట్ల మాధవ్‌

వైఎస్సార్సీపీ ఫ్యాను గాలి గట్టిగా వీస్తోంది.. అదీ ఎన్నికల ప్రచార సమయంలోనే. హిందూపురం లోక్‌సభకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, మాజీ పోలీస్‌ అధికారి గోరంట్ల మాధవ్‌ని రంగంలోకి దించిన విషయం విదితమే. గోరంట్ల మాధవ్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేసి, వైఎస్సార్సీపీలో చేరగా అతన్ని 'రిలీవ్‌' చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం నానారకాల అడ్డంకులూ పెట్టింది. ట్రిబ్యునల్‌కి వెళ్ళి క్లియరెన్స్‌ తెచ్చుకున్నా, చంద్రబాబు కనుసన్నల్లోని ఏపీ ప్రభుత్వం మరిన్ని అడ్డంకులు సృష్టించింది.

చివరికి హైకోర్టులోనూ గోరంట్ల మాధవ్‌కి ఊరట దక్కడంతో, హిందూపురం లోక్‌సభ నియోజకవర్గ వైసీపీ నేతలు, కార్యకర్తలే కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఆ పార్టీ శ్రేణులంతా 'గోరంట్ల మాధవ్‌ ముందే గెలిచేశారు..' అంటూ నినదిస్తున్నారు. నిజమే మరి, గోరంట్ల మాధవ్‌కి వ్యతిరేకంగా చాలా రాజకీయ రచ్చ జరిగింది, జరుగుతూనే వుంది. చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తితే ఎలా? అన్న కోణంలో గోరంట్ల మాధవ్‌ ఒకింత ఆందోళన చెందారు. ఒకవేళ తన నామినేషన్‌ కుదరకపోతే, తన భార్య పేరుతో నామినేషన్‌ వేయించాలనుకున్నారు. అందుకు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

ఇంతలోనే, హైకోర్టు గోరంట్ల మాధవ్‌కి అనుకూలంగా తీర్పునిచ్చింది. దాంతో, హిందూపురం వైసీపీ లోక్‌సభ అభ్యర్థిగా గోరంట్ల మాధవ్‌కి అడ్డంకులు పూర్తిగా తొలగిపోయినట్లే. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఓవరాక్షన్‌ ఫలితమే గోరంట్ల మాధవ్‌ రాజకీయాల్లోకి రావడం. పోలీస్‌ వ్యవస్థపై జేసీ దివాకర్‌రెడ్డి 'యెల్లో రౌడీయిజం' ప్రదర్శిస్తే, పోలీస్‌ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టేందుకు.. రాజకీయ వ్యవస్థతో తలపడాలనుకున్నారు గోరంట్ల మాధవ్‌. అయితే, చంద్రబాబు సర్కార్‌ గోరంట్ల మాధవ్‌ని తొక్కిపెట్టేందుకు చాలా ప్రయత్నాలే చేసింది.

ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న గోరంట్ల మాధవ్‌, ఉద్యోగానికి రాజీనామా చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం విదితమే. హిందూపురం నియోజకవర్గంలో రికార్డుస్థాయి మెజార్టీతో గోరంట్ల గెలుపు ఖాయమని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ప్రజల సొమ్ముతో ప్రలోభాలు.. ఇదే నయా రాజకీయం!