Advertisement

Advertisement


Home > Politics - Political News

యాంక‌ర్ అవ‌తార‌మెత్తిన వైసీపీ ఎంపీ

యాంక‌ర్ అవ‌తార‌మెత్తిన వైసీపీ ఎంపీ

వైసీపీలో ముఖ్య నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి యాంక‌ర్ అవతారమెత్తారు. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌ను నిర‌సిస్తూ శుక్ర‌వారం చేప‌ట్టిన ఏపీ బంద్‌లో విజ‌య‌సాయిరెడ్డి మైక్ ప‌ట్టుకుని జ‌నం అభిప్రాయాల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. విశాఖ‌లో చేప‌ట్టిన నిర‌స‌న కార్య‌క్ర‌మంలో విజ‌య‌సాయిరెడ్డి పాల్గొన్నారు.

మద్దిలపాలెం బస్టాండ్‌ వద్ద కార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి. రోడ్డుపై బైఠాయించి కార్మికులు చేప‌ట్టిన‌ నిరసనలో వైఎస్సార్‌ సీపీ ఎంపీలు  విజయసాయిరెడ్డి,  ఎంవీవీ సత్యనారాయణ, మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్ నాథ్‌,  కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. విశాఖ ప్లాంట్‌ ఏ-షిఫ్ట్‌లో కార్మికులు విధులు బహిష్కరించారు.

ఈ సంద‌ర్భంగా విజ‌య‌సాయిరెడ్డి మైక్ ప‌ట్టుకుని పాద‌చారులు, ద్విచ‌క్ర‌వాహ‌న‌దారులు, కార్మికుల ద‌గ్గ‌రికి నేరుగా వెళ్లి వారి అభిప్రాయాలను కేంద్రానికి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. ముఖ్యంగా యువ‌కుల ద‌గ్గ‌రికి విజ‌య‌సాయిరెడ్డి వెళ్లి వారితో మాట్లాడించారు. అనంత‌రం విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ  ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు త‌మ  ప్రభుత్వం ప్రత్యక్షంగా పోరాటం చేస్తోందన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించారన్నారు.  ఆ మార్గాలను ఆచరిస్తే త‌ప్ప‌కుండా లాభాలు వస్తాయని, ప్రైవేటీక‌ర‌ణ వైపు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌న్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వైఎస్సార్‌ సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని ఆయ‌న మ‌రోసారి తేల్చి చెప్పారు. 

కేంద్రానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాసిన పది రోజులకు.. చంద్రబాబు స్పందించి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.  టీడీపీ అంటేనే డ్రామాల పార్టీ అని, ఆయన కుమారుడు పప్పునాయుడని విజ‌య‌సాయిరెడ్డి త‌న మార్క్ పంచ్‌లు విసిరారు.  

రైతు గొప్పతనమే ఇతివృత్తంగా శ్రీకారం సినిమా

ఆర్కే నాయుడు క్యారెక్ట‌ర్ ని ఎవ‌రూ రీప్లేస్ చేయ‌లేరు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?