Advertisement

Advertisement


Home > Politics - Political News

బాబు సెల్ఫ్ డబ్బా.. ఈసారి మరింత గట్టిగా

బాబు సెల్ఫ్ డబ్బా.. ఈసారి మరింత గట్టిగా

ఆత్మస్తుతి-పరనింద.. ఈ రెండూ చంద్రబాబుకి తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలియవు. చేతిలో అనుకూల మీడియా ఉండటంతో.. ఇప్పటి వరకూ ఇదే పద్ధతిని అవలంబించారు బాబు. 

ఏడాదిన్నరగా వైసీపీ పాలనపై అభాండాలు వేసిన బాబు.. ఇప్పుడు ఆత్మస్తుతికి సిద్ధమవుతున్నారు. ప్రతిపక్ష నేతగా బాబు విజయాలను కొనియాడేలా సరికొత్త ప్రచారానికి తెరవెనక రంగం సిద్ధమౌతోంది.

ఎన్నికలు పూర్తై ఏడాది, రెండేళ్లకు.. ఎవరైనా అధికార పార్టీ ఏం చేసిందా అని చూస్తారు. కానీ ఏపీలో మీడియా, సోషల్ మీడియా మాత్రం ఏడాదిన్నర కాలంలో ప్రతిపక్షం ఎంత బాగా పనిచేసిందా అని రివ్యూలు రాస్తున్నారు. 

చంద్రబాబుకి ఉన్న ప్రచార పిచ్చికి ఇది మరో నిదర్శనం. తాజాగా ఈ సెల్ఫ్ ప్రమోషన్ ని భారీ స్థాయిలో స్టార్ట్ చేశారు బాబు. ఇన్నాళ్లూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు, రకరకాల అంశాల్ని లేవనెత్తారు. 

అభివృద్ధి కార్యక్రమాలకు లేనిపోని అడ్డంకులు సృష్టించాలని చూశారు. ప్రతి విషయానికీ కోర్టుకెక్కి మోకాలడ్డారు. ఈ వేషాలన్నీ పూర్తయ్యే సరికి ఇప్పుడు సెల్ఫ్ ప్రమోషన్ పై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టారు బాబు.

ప్రతిపక్ష నాయకుడిగా బాబు ఇమేజ్, రేటింగ్ బాగా పెరిగాయంటూ టీడీపీ సర్కిల్స్ లో అప్పుడే ప్రచారం మొదలైంది. ఈ ఏడాదిన్నరలో బాబు ఓ యోధుడిగా పోరాడడంటూ విశ్లేషణలు, కథనాలు ఆయా గ్రూపుల్లో తిరుగుతున్నాయి. 

అనుకూల మీడియా కూడా సరంజామా సిద్ధం చేసి.. ప్రతి రోజూ బాబుని బ్యానర్ ఐటమ్ తో ఎత్తుకోడానికి రంగం సిద్ధం చేస్తోంది.అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా సెల్ఫ్ ప్రమోషన్ ను మాత్రం చంద్రబాబు మిస్ చేసుకోరు అనడానికి ఇదే నిదర్శనం. 

కేవలం జాతీయ స్థాయి నాయకుడ్ని అని చెప్పుకోవడం కోసమే చంద్రబాబు గతంలో జాతీయ మీడియాకు కోట్ల రూపాయలు తగలేశారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవడం కోసం అనుకూల మీడియాకు కోట్లు కుమ్మరించారు. 

ఇప్పుడు ఆ స్థాయిలో కాకపోయినా, తనకున్న లాబీయింగ్ తో మరోసారి సొంత డబ్బాకు సిద్ధమౌతున్నారు బాబు. జూమ్ మీటింగ్ లు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహానాడు నిర్వహణ, అమరావతి ధర్నాలు, జోలెపట్టి భిక్షాటన చేయడాలు.. ఇవన్నీ టీడీపీ విజయాలట. వీటిపై ఎక్కువ ఫోకస్ పెడుతూ.. పచ్చపాత మీడియాలో ప్రత్యేక కథనాలు ప్రిపేర్ అవుతున్నాయి. 

ఎన్నికల తర్వాత పేపర్ల సంఖ్యను బాగా తగ్గించుకున్న ప్రింట్ మీడియా.. చంద్రబాబుని కూడా లోపలి పేజీల్లోకి తోసేసింది. ఇప్పుడిప్పుడే ఈ విపత్తు నుంచి కోలుకుంటున్న తరుణంలో.. ఇకపై ప్రతిరోజూ చంద్రబాబుని ఫ్రంట్ పేజీలోకి తీసుకొచ్చి ఆయన ఇమేజ్ పెంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

వాస్తవానికి ఏడాదిన్నర కాలంలో సగం రోజులు చంద్రబాబు హైదరాబాద్ లోనే దాక్కున్నారు. మిగతా రోజుల్లో జనం గురించి కాకుండా.. తన మనుషుల గురించే ఆలోచించారు. 

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. కొడుకు భవిష్యత్ గురించే ఆయన ప్రతి క్షణం మథన పడ్డారు, పడుతున్నారు. ఈ నేపథ్యంలో బాబు విజయాలపై జరిగే ప్రచారం.. ఎంత కామెడీగా ఉంటుందో చూడాలి. త్వరలోనే ఆ ముచ్చటను ఈనాడు-ఆంధ్రజ్యోతి వేదికగా చూడబోతున్నాం. గెట్ రెడీ.

జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?