Advertisement

Advertisement


Home > Politics - Political News

బాబు మీడియా తక్షణ కర్తవ్యం ఇదే

బాబు మీడియా తక్షణ కర్తవ్యం ఇదే

గత కొన్నిరోజులుగా జాతి మీడియాలో ఒకటే హడావిడి, ఒకే రకం వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈనాడులో కాస్త పాలిష్డ్ గా వస్తుంటే, ఆంధ్రజ్యోతి తన స్థాయిలో బరితెగించి రెచ్చిపోతోంది. ఇటీవల ఈ రెండింటికీ పోటీ వచ్చిన ఓ న్యూస్ ఛానెల్ శక్తివంచన లేకుండా ఆ టాస్క్ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తోంది. వీరందరి దురాశయం ఒకటే. వైసీపీ, బీజేపీ మధ్య చిచ్చు పెట్టడం. మాటల మంటలు రేపడం, తద్వారా రాజకీయ లబ్ధి పొందడం.

వాస్తవానికి వైసీపీ, బీజేపీ ఎవరికి వారే యమునా తీరే అన్నదారిలో ఉన్నారు. కేంద్రంలో బీజేపీపై వైసీపీ పెద్దగా విమర్శలు చేసిన దాఖలాలు లేవు, రాష్ట్రంలో వైసీపీని కేంద్ర స్థాయిలో ఎవరూ తక్కువచేసి మాట్లాడలేదు. మధ్యలో చంద్రబాబు చేతి కీలుబొమ్మ కన్నా లక్ష్మీనారాయణ, బాబు చేసిన తోలుబొమ్మ సుజనా చౌదరి తమ శక్తివంచన లేకుండా శకుని పాత్ర పోషించారు. అయినా వారి పాచికలు పారలేదు.

ఈలోగా కన్నాకి సున్నం పెట్టి వీర్రాజుని దించింది అధిష్టానం. దీంతో ఒక్కసారిగా టీడీపీ లెక్కలు మారిపోయాయి. వీర్రాజు నేరుగా టీడీపీయే మా టార్గెట్ అంటున్నారు. దీంతో సమీకరణాలన్నీ మారిపోయాయి. రాజధాని పోరాటంలో తమతో కలిసొస్తారనుకున్న బీజేపీ నేతల్ని వీర్రాజు ఏరిపారేస్తున్నారు. ఒకరకంగా రాజధాని విషయంలో వైసీపీకి మద్దతుగా నిలిస్తున్నారు. ఈ దశలో నేరుగా వైసీపీ, బీజేపీ మధ్య చిచ్చు రాజుకోవడం కుదరని పని.

అందుకే పచ్చపాత మీడియా పెట్రోల్ పోస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మాటలకు వక్ర భాష్యాలు చెబుతోంది. మూడు రాజధానులకు బీజేపీ వ్యతిరేకం అంటూ కథనాలు వండివారుస్తోంది. ఇక టీడీపీ అనుకూల మీడియా ఛానెళ్లలో వచ్చే చర్చలు పూర్తిగా వైసీపీ, బీజేపీ మధ్య చిచ్చు పెట్టేలా ఉంటున్నాయి. రెచ్చగొట్టే మాటలు, కవ్వించే వ్యవహారాలు.. వారి టార్గెట్ ఒకటే. మూడు రాజధానులకు బీజేపీ వ్యతిరేకం అనేలా సీన్ క్రియేట్ చేయడం, బీజేపీపై వైసీపీ నేతలు విమర్శలు సంధిస్తే వాటిని హైలెట్ చేయడం.. ఇదే లక్ష్యంతో పనిచేస్తోంది బాబు అనుకూల మీడియా.

అమరావతి బాటలో టీడీపీ ఒంటరి కావడం వీరికి ఇష్టం లేదు. చంద్రబాబుకి సొంత బలం లేదు కాబట్టి, బీజేపీ, జనసేన మద్దతుని కూడగట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. పనిలో పనిగా వైసీపీ, బీజేపీ మధ్య చిచ్చుపెట్టి కేంద్రం దృష్టిలో జగన్ ని తక్కువ చేసేలా చూస్తున్నాయి. బాబు మీడియా తక్షణ కర్తవ్యం ఇదే.

వైఎస్సార్ చేయూత

పవన్ కళ్యాణ్ చదివినన్ని బుక్స్ ఏ హీరో చదవలేదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?