Advertisement

Advertisement


Home > Politics - Political News

ముగిసిన సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌

ముగిసిన సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగిసింది. కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాతో బుధ‌వారం మ‌రోసారి స‌మావేశం అయ్యారు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. మ‌రో కేంద్ర మంత్రి గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్ తో స‌మావేశం అయ్యారు. అనంత‌రం ఢిల్లీ నుంచి డైరెక్టుగా ఆయ‌న తిరుమ‌ల బ‌య‌ల్దేరారు. రెండు రోజుల పాటు ఢిల్లీ ప‌ర్య‌టించిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, రెండు రోజుల పాటు తిరుమ‌లలో ఉండ‌నున్నారు. 

రెండు రోజుల పాటు తిరుప‌తి నుంచినే సీఎం అధికారిక విధుల‌ను నిర్వ‌హించ‌నున్నారు. నేటి సాయంత్రం ఐదున్న‌ర‌కు అన్న‌మ‌య్య భ‌వ‌న్ నుంచి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీతో జ‌రిగే వీడియో కాన్ఫ‌రెన్స్ లో పాల్గొంటారు.  

సాయంత్రం ఆరు గంట‌ల‌కు ఆంజ‌నేయ స్వామి ఆల‌యాన్ని ద‌ర్శించుకుని, అక్క‌డ నుంచి శ్రీవారి ఆల‌యానికి చేరుకుని ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప‌ట్టువ‌స్త్రాల‌ను స‌మ‌ర్పిస్తారు. గురువారం ఉద‌యం క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి య‌డియూర‌ప్ప‌తో క‌లిసి శ్రీవారిని ద‌ర్శించుకుంటారు. రేపు ఉద‌యం తొమ్మిదిన్న‌ర స‌మ‌యంలో రేణిగుంట నుంచి జ‌గ‌న్ అమ‌రావ‌తికి తిరుగు ప్ర‌యాణం అవుతారు. 

వ్యవస్థను కాపాడాల్సిన కోర్టే ఇలా చేస్తే

చీఫ్ జస్టిస్ అయితే కొత్త న్యాయం ఉందా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?