cloudfront

Advertisement


Home > Politics - Political News

వైఎస్ భారతిపై వార్తలు.. స్పందించిన జగన్

వైఎస్ భారతిపై వార్తలు.. స్పందించిన జగన్

పచ్చ మీడియా రొటీన్ పైత్యాన్నే చూపింది.. వైఎస్ భారతి పేరును సీబీఐ అయితే వదిలింది కానీ, ఈడీ మాత్రం వదల్లేదని, రేపటి నుంచి జగన్ సతీసమేతంగా కోర్టుకు హాజరు కావాలని.. తమ కసిని అంతా చూపించేసింది ఒక పచ్చ పత్రిక. ఇంకెంత సమయం లేదు కదా.. మరో పది నెలల్లో ఎన్నికలు. తర్వాత రాజెవరో రౌతెవరో.. ఇప్పుడే తమ కసినంతా కక్కేయాలన్నట్టుగా ఒక పత్రిక వ్యవహరించింది.

ఈ కథనం ఎలా వండి వార్చినా.. అసలు విషయం ఏమిటంటే, జగన్ భార్య భారతి పేరును చార్జిషీట్లో చేర్చడానికి ఈడీ కోర్టు అనుమతిని అడిగింది. అందుకు అనుమతి లభిస్తుందో లేదో తెలియదు కానీ.. జగన్ సతీ సమేతంగా కోర్టుకు హాజరు కావాలని పచ్చపైత్యాన్ని చాటుకున్నారు.

ఇక ఈ వ్యవహారంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ట్విటర్ ద్వారా జగన్ రియాక్ట్ అయ్యాడు.‘‘Shocked to see the reports by select media today, where my wife was named as accused by ED. Saddened to see politics degraded to such levels where even family is not spared’’ అని జగన్ ట్వీట్ చేశారు.

తన కుటుంబీకులను కూడా వదలకుండా సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలపై జగన్ ఈ విధంగా స్పందించారు. ఒకవైపు జగన్ మోహన్ రెడ్డిపై పెట్టిన కేసుల్లోని చార్జిషీట్లే చాలా వరకూ కొట్టివేతకు గురి అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్ భార్యను కూడా వార్తల్లోకి లాగుతున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా.. ఇంకా ఏమైనా చేయగలరు!