Advertisement

Advertisement


Home > Politics - Political News

తెలంగాణలో మరో పాదయాత్ర.. ఈసారి షర్మిల వంతు

తెలంగాణలో మరో పాదయాత్ర.. ఈసారి షర్మిల వంతు

ప్రస్తుతం తెలంగాణలో ఓ పాదయాత్ర నడుస్తోంది. బండి సంజయ్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మరో నెల రోజుల్లో తెలంగాణలో మరో పాదయాత్ర ప్రారంభంకాబోతోంది. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఈరోజు తన పాదయాత్ర ప్రణాళిక వెల్లడించారు. అక్టోబర్ 20 నుంచి ఆమె తన పాదయాత్ర మొదలుపెట్టబోతున్నారు. దీనికి ఆమె పెట్టిన పేరు ప్రజా ప్రస్థానం.

తన ప్రజాప్రస్థానం చేవెళ్ల నుంచి ప్రారంభించి, తిరిగి చేవెళ్లలోనే ముగుస్తుందని ప్రకటించారు షర్మిల. రోజుకు 12 నుంచి 15 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తానని, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటానని ఆమె తెలిపారు.

"కేసీఆర్ కి కాంగ్రెస్-బీజేపీ ఎలా అమ్ముడుపోయాయో ప్రతి మనిషికి వివరిస్తాం. దిక్కులేక ఇక కేసీఆర్ కు ఓట్లు వేయాల్సిన అవసరం లేదని, మేం ఒక ప్రత్యామ్నాయంగా ఉన్నామని ప్రజలకు నా పాదయాత్ర ద్వారా నమ్మకం కలిగిస్తాం. ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు ఇవ్వకపోతే, నా పాదయాత్రలో కూడా మంగళవార నిరాహార దీక్షలు కొనసాగిస్తాను."

తన పాదయాత్ర కనీసం ఏడాది పాటు ఉంటుందని, ఎన్నికల వరకు రోడ్ల మీద బతుకుతామని విస్పష్టంగా ప్రకటించారు షర్మిల. ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం లాంటి పథకాలు వైఎస్ఆర్ పాదయాత్ర నుంచే పుట్టాయని, ఆయన అడుగుజాడల్లోనే తన పాదయాత్ర ఉంటుందని, హామీలు-పథకాలు అన్నీ ప్రజల్లోనే ప్రకటిస్తామని తెలిపారు షర్మిల.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?