cloudfront

Advertisement


Home > Politics - Political News

పొత్తులపై మరింత స్పష్టత ఇచ్చిన విజయమ్మ

పొత్తులపై మరింత స్పష్టత ఇచ్చిన విజయమ్మ

ఓవైపు ఎలాంటి పొత్తులు ఉండవని జగన్ పదే పదే చెబుతున్నప్పటికీ... తెలుగుదేశం పార్టీ నేతల తీరు మాత్రం మారడంలేదు. ఏదో ఒక పార్టీతో ముడిపెడుతూ జగన్ పై పసలేని విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి చవకబారు విమర్శలు వినీవినీ స్పందించడం మానేశారు జగన్. ఓ చిరునవ్వు నవ్వి ఊరుకుంటున్నారు. ఇప్పుడా పొత్తులపై స్వయంగా విజయమ్మ స్పందించారు.

తమ పార్టీకీ ఎవరి మద్దతు అవసరం లేదని కుండబద్దలు కొట్టారు వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి తిరుగులేని మెజారిటీ వస్తుందని, పొత్తులతో ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టంగా ప్రకటించారు. మరోవైపు మద్దతు ఇస్తామంటూ బహిరంగంగా ప్రకటించిన టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలపై కూడా విజయమ్మ స్పందించారు.

"ఒవైసీ గారు రాష్ట్రమంతా తిరిగి ముస్లిమ్స్ ను ఏకం చేస్తామంటున్నారు. అభినందించదగ్గ విషయమే. కేసీఆర్ గారు కూడా వస్తానంటున్నారు. చాలా సంతోషం. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే.. వైఎస్ఆర్సీపీ సొంతంగానే మెజారిటీ సాధిస్తుంది. వీళ్లందరు కూడా సహాయం చేస్తే మరీ మంచిది. అంతా మంచికే కదా."

మరోవైపు పార్టీ ఎజెండా గురించి కూడా అంతే విస్పష్టంగా మాట్లాడారు విజయమ్మ. ప్రత్యేకహోదా అనే సింగిల్ ఎజెండాతో ముందుకెళ్తున్నామని, ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎవరు ప్రత్యేక హోదా ఇస్తామంటే వాళ్లకే మద్దతిస్తామని తెలిపారు.

గత ఎన్నికల్లో అవసరం మేరకు తను పోటీచేశానని, ఈసారి మాత్రం తనకు రాజకీయాలపై పూర్తిగా ఆసక్తి తగ్గిపోయిందని ప్రకటించారు విజయమ్మ. జగన్ కూడా ఈసారి తనను అడగకపోవచ్చని అన్నారు. 

తనయుడు చనిపోయినా షూటింగ్‌ పూర్తి చేసిన ఎన్టీఆర్‌

పబ్లిక్ పల్స్: వినయ విధేయ రామ ఎలా ఉందంటే?