cloudfront

Advertisement


Home > Politics - Political News

వైఎస్‌ వివేకానందరెడ్డి కన్నుమూత

వైఎస్‌ వివేకానందరెడ్డి కన్నుమూత

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. వైఎస్సార్‌ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురయిన వైఎస్‌ వివేకానందరెడ్డి పులివెందులలో మృతిచెందారు.

గతంలో మంత్రిగా, ఏంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా వివేకానందరెడ్డి పనిచేశారు. 1989,1994లలో పులివెందుల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన కడప లోక్‌సభకు కూడా ప్రాతినిథ్యం వహించారు. వైఎస్‌ వివేకానందరెడ్డి మరణంతో పులివెందులలో విషాదఛాయలు అలుముకున్నాయి.

చంద్రబాబు చేసిందే నేను చూపిస్తున్నా.. వర్మ

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!