cloudfront

Advertisement


Home > Politics - Political News

జగన్ పై హత్యాయత్నం.. కుట్రదారులు వీళ్లే!

 జగన్ పై హత్యాయత్నం.. కుట్రదారులు వీళ్లే!

తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం విషయంలో రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. జగన్ పై హత్యాయత్నంపై ఏపీ ప్రభుత్వం జరిపిస్తున్న విచారణపై తమకు నమ్మకం లేదని.. ఈ విషయంలో థర్డ్ పార్టీ విచారణను కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతికి విన్నవించింది. ఒకవైపు ఇదే విషయంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.

ఇక ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసిన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు. జగన్ పై జరిగిన హత్యాయత్నంలో తాము అనుమానిస్తున్న కుట్రదారుల పేర్లను కూడా వీళ్లు వెల్లడించడం గమనార్హం. వైసీపీ వెల్లడించిన జాబితాలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ముందున్నాడు. కర్త, కర్మ ,క్రియ చంద్రబాబే అని విజసాయిరెడ్డి అన్నాడు.

చంద్రబాబుతో పాటు.. పలువురు టీడీపీ నేతల పేర్లను వైసీపీ నేతలు వెల్లడించారు. అందులో మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావులు ఉండటం విశేషం. సినిమా డ్రామా ఆర్టిస్టు శివాజీకి కూడా ఈ కుట్రలో సంబంధం ఉందని అన్నారు.

వీరితో పాటు ఏపీ డీజీపీ మీద కూడా తమకు అనుమానాలున్నాయని వైసీపీ నేతలు ప్రకటించారు. తమకున్న సమాచారం ప్రకారం.. వీరందరి భాగస్వామ్యం ఉందని, అందుకు సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని వైసీపీ నేతలు ప్రకటించారు. 

టీడీపీ ఎమ్మెల్యేకు జేసీ అనుచరుడితో టెన్షన్‌!.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్