cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

'చలో ఆత్మకూర్' ఎవరి పై చేయి..?

'చలో ఆత్మకూర్' ఎవరి పై చేయి..?

ఎన్నికలు అయిన వందరోజుల తర్వాత రెండుపార్టీల మధ్యన ఒక ఆసక్తిదాయకమైన పోరాటం మొదలైంది. ఇందులో ఎవరికి వారు తమదే పైచేయి అని ప్రకటించుకుంటూ ఉన్నారు. చలో ఆత్మకూర్ సూపర్ హిట్ అని తెలుగుదేశం అనుకూల మీడియా వర్గాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. అసలు చంద్రబాబును ఇంటి నుంచి బయటకే రానీయలేదు.. అలాంటిది ఆ కార్యక్రమం ఎలా హిట్ అంటారని ప్రశ్నించేవాళ్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ ప్రశ్నలతో తెలుగుదేశం అనుకూల మీడియాకు పనిలేదు. తను చెప్పాలనుకున్నది తను చెబుతుంది. 

విశేషం ఏమిటంటే.. ఈ ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు జాతీయ మీడియాను బాగా 'పోషించారు' అనే టాక్ వినిపిస్తూ ఉంది. చంద్రబాబును, ఆయన తనయుడిని హౌస్ అరెస్ట్ చేసిన జగన్ ప్రభుత్వం అంటూ ఇంగ్లిష్ మీడియాలో కథనాలు రావడం వెనుక భారీగానే ప్యాకేజీలు చేతులు మరాయాని టాక్!

డబ్బుకు లోకం దాసోహం అన్నట్టుగా.. ఈ గోరంత అంశాన్ని కొండంత చేయడానికి జాతీయ మీడియా వర్గాలు బాగానే ఆర్థిక లబ్ధి పొందిందని సమాచారం. ఇక సోషల్ మీడియాలో కొంతమంది మరో ప్రశ్నను రైజ్ చేశారు. అదేమిటంటే.. గతంలో విశాఖ వెళ్లడానికి జగన్ ప్రయత్నిస్తే అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకుందని, ఇప్పుడు చంద్రబాబును జగన్ అడ్డుకోవడం అధికార దర్పం అని వాళ్లు వ్యాఖ్యానించారు. ఇందులో లాజిక్ ఉంది కానీ, పరిస్థితుల్లో తేడాలు మాత్రం కొట్టుకొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి.

జగన్ వెళ్తానన్నది ప్రజా సంబంధ వ్యవహారానికి. చంద్రబాబు వెళ్లాలనుకున్నది పార్టీ సంబంధం వ్యవహారానికి. దేనికైనా వెళ్లేందుకు వ్యక్తి స్వేచ్ఛ ఉంది కదా.. అనొచ్చు. అలాంటప్పుడు ముందుగా పునరావాస శిబిరాలను ప్రస్తావించాలి. వాటిల్లోని వారిని సొంతూళ్లకు చేర్చే బాధ్యత చంద్రబాబుది కాదు. ఒక గ్రామంలో ఎవరి మీద అయినా దాడిచేస్తే వెళ్లి కంప్లైంట్ ఇవ్వాల్సింది చంద్రబాబుకు కాదు, బాధితులు వెళ్లి పోలీసులను రక్షణ కోరాలి.

పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే ఈ వ్యవహారంలో బాధితులు ఎక్కడా పోలీసుల వద్దకు వెళ్లిన దాఖలాలు లేవు. ఇక పునరావాస శిబిరాల్లో ఉన్న వారు చాలా మంది వ్యక్తిగత కారణాలతో అక్కడ మకాం పెట్టారని కూడా తెలుస్తోంది. మూడు పూటలా అన్నం పెట్టి, అక్కడ ఉన్నందుకు డబ్బులు ఇస్తామంటే.. శాశ్వతంగా అయినా అక్కడ అక్కడే మకాం పెట్టే వాళ్లు బోలెడంత మంది దొరుకుతారు. అలాంటి వారే అక్కడ కొందరు ఉన్నారని.. అధికారులు తేల్చారు.

వారిని తీసుకెళ్లి అధికారులు, పోలీసులు సొంతూళ్లలో వదిలిపెట్టారు. ఇంకేముంది.. సమస్య పరిష్కారం అయినట్టే. ఒకవేళ చంద్రబాబు నాయుడు వాళ్లను తీసుకెళ్లి సొంతూళ్లో వదిలారనే అనుకుందాం. అప్పుడు మళ్లీ వారిపై దాడులు జరిగితే? చంద్రబాబు నాయుడు అక్కడే కూర్చోలేరు కదా! కాబట్టి.. ఈ వ్యవహారాన్ని పోలీసులు డీల్ చేయడమే చాలా మంచిది. అదే జరిగింది. అయినా చంద్రబాబు నాయుడు ఆగరట. ఆత్మకూరు వెళ్లనే వెళ్తారట. అయినా.. మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు.. గత ఐదేళ్లలో పల్నాడు ఏరియాలో తెలుగుదేశం నేతల, ఎమ్మెల్యేల, కార్యకర్తల అరాచకాలకు హద్దే లేదు.

అలాంటి చోట గత ఐదేళ్లూ వీర చేత నష్టపోయిన వారు ఇప్పుడు ఊరికే ఉండరు అనేది కామన్ లాజిక్. తాము కొడితే కొట్టించుకోవాలి, అవతల వాళ్లు కొడితే ఇలా గగ్గోలు పెట్టడం జాతి లక్షణం అని కూడా కొంతమంది నెటిజన్లు అంటున్నారు. ఆయా గ్రామాల్లో వీళ్ల జాతేతర వాళ్లు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. మరి దాన్నేమనాలి? వాళ్ల వాయిస్ ను ఎందుకు వినిపించనీయడం లేదు?

జగన్... గారాబం చేయడం నేర్చుకోవాలి!