cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

టీటీడీలో ఏం జరుగుతోంది? బోర్డు సభ్యులు హోదాలకేనా?

టీటీడీలో ఏం జరుగుతోంది? బోర్డు సభ్యులు హోదాలకేనా?

ఒకవైపు తెలుగుదేశం పార్టీ అనుకూల వర్గాలు తిరుమలను తమ రాజకీయానికి వాడుకుంటూ ఉన్నాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ తీరు కొనసాగుతూ ఉంది. మత రాజకీయం చేయడానికి తెలుగుదేశం పార్టీ వాళ్లు, పవన్ కల్యాణ్ తెగ ఉబలాటపడుతూ ఉన్నారు.

జగన్ మీ తాము చేయదగిన ఏకైక రాజకీయం మతరాజకీయమే అని తెలుగుదేశం పార్టీ, పవన్ కల్యాణ్ లు ఫిక్స్ అయిన దాఖలాలు కనిపిస్తున్నాయి. అటు బీజేపీకి దగ్గర కావడానికి కూడా వారికి ఇదే మార్గంగా కనిపిస్తూ ఉంది.

ఏ రకంగానూ వేలెత్తి చూపడానికి లేకుండా జగన్ పాలన సాగుతూ ఉంది. అంతకు మించి చంద్రబాబు ఏం మాట్లాడినా, పవన్ కల్యాణ్ ఏం మాట్లాడినా.. గత ఐదేళ్లూ మీరేం చేశారు? అనే ప్రశ్న తప్పడం లేదు. ఇలాంటి నేపథ్యంలో అడ్డగోలుగా మత రాజకీయం మొదలైంది. 

అందుకోసం సమస్యలను క్రియేట్ చేయడానికి, ఇంగ్లిష్ మీడియం చదవులు కూడా మతమార్పిడిల కోసమే అంటూ ప్రచారం చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. తెలుగుదేశం వర్గాలు అధికారికంగానే ఇలాంటి ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఇక తాజాగా టీటీడీ పై బురదజల్లుడు వ్యవహారంపై చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.

తప్పుడు ప్రచారం గురించి ఆయన తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. చైర్మన్ స్పందించారు కానీ, ఇంత జరుగుతున్నా టీటీడీ బోర్డు సభ్యులు మాత్రం ఎవరూ స్పందించలేదు. పేరుకు ఇరవై తొమ్మిది మంది జంబో టీటీడీ సభ్యులున్నారు. అయితే తెలుగుదేశం విష ప్రచారం మీద వారు స్పందించడం లేదు. తమకెందుకు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు వాళ్లంతా.

దీనికి కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అందులో ముఖ్యమైన కారణం జేఈవో తీరు కూడా అని సమాచారం. బోర్డు సభ్యులు ఎవ్వరినీ జేఈవో ధర్మారెడ్డి లెక్క చేయరని, ఎవ్వరి మాటలకూ వీసవెత్తు విలువను ఇవ్వరని, అందుకే సభ్యులు కూడా తమ హోదాను ఉపయోగించుకుంటూ పనులు చేసుకోవడమే తప్ప, పరిస్థితులను చక్కదిద్దే ఆసక్తి లేదని తెలుస్తోంది.

అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో హోదాల కోసం తాపత్రయ పడే వాళ్లే తప్ప, ఆ హోదాకు తగ్గట్టుగా బాధ్యతలు తీసుకునే వాళ్ల సంఖ్య కూడా కనిపిస్తూ ఉంది. అందుకే తీవ్రమైన విషప్రచారం సాగుతున్నా.. ఎవ్వరూ నోరు మెదపడం లేదు. అధినేతకు ఈ విషయాలు అర్థం అవుతున్నాయా?