పచ్చి గా మాట్లాడితే మన జీన్స్ లో నే బానిస మనస్తత్వం ఉంది. మనం సేవకులమే తప్ప నాయకులం కాదు అని మన మైండ్ లో ఇంకిపోయేలా చేశారు మన పురాతన కాలం నుంచీ. దీనికి కారణం కూడా లేకపోలేదు, మన జాతి వారి వారి కుటుంబాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు.. దానికి అవసరం అయినా ఆర్ధిక పరి పుష్టత సమకూర్చుకలేకపోవడం.
దీనికి కూడా కారణం లేకపోలేదు, జనాభా ఎక్కువ ఉండడం…విగ్రహ పుష్టి నైవేద్యం నిష్టి…అని ఎంత సేపు గాడిద పాల లాగ ఎక్కువ ఉంటే నేమి గంగి గోవు పాల లాగ కొందరు కూడా తయారు కాలేనప్పుడు అన్నట్టు,ఇంత మంది దారిద్ర్యం లో ఉన్న వాళ్ళని దాని వల్ల వాళ్లకు స్వాతహాగ వచ్చిన బానిస మైండ్ సెట్ ని మార్చడం కూడా కష్టం.
కమ్మ వాళ్ళు జనాభాలో తక్కువ కాబట్టే ఆల్రెడీ పైకి వెళ్లిన వాళ్ళు తదుపరి వాళ్ళని పైకి తీస్కారడానికి అవకాశం కల్పించడానికి ఆస్కారం లభించింది. రెడ్డి వాళ్లకి గత శతబ్దం నుంచీ వాళ్ళ భూస్వామ్య ఆస్తుల్లా వల్ల సహజం గానే ఆర్ధిక పరి పృష్టి సాధించారు. అందుకే రాజకీయం అయినా… బిజినెస్ అయినా తెగింపుతో ముందుకు వెళ్తారు. ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టు… విజయం వాళ్ళని వారిస్తుంది.
మనది సచ్చు బ్రతుకులు అయిపోయే…ఎక్కడి నుంచీ వస్తుంది నాయకుడు అనే టాగ్. ఎదో అక్కడ ఇక్కడ చిన్న పాటి గవర్నమెంట్ క్లర్క్ ఉద్యోగం చాలు… జీవితాన్ని సచ్చుగా సాగిస్తేయ్ చాలు, అనే ఉదేశ్యం తో చదువుతారే తప్ప…ని యాల్దీ కొడితే కుంభస్థలం కొట్టాలి అని లోపల యావ తప్ప బయట కి వచ్చి రిస్క్ చేసి పోగుట్టుకోడానికి రెడీ అయ్యి చేసేంత ఉండదు. పోతే పోయింది పావలా నే కదా అన్నట్టు ఉండదు… ఎలాగూ పది రూపాయలు ఉంది కదా ఏమైతది అనే ధైర్యం ఉండదు. అంత మధ్య తరగతికి ప్రతి నిధులం.
కాబట్టి మన జాతి హిస్టరీ.. ప్రెసెంట్.. ఫ్యూచర్ ఎప్పుడు దౌర్భాగ్యమే. రెడ్డి కమ్మ గారి సదువు పది మందికి జాబ్ ఇచ్చే రేంజ్ లో ఉంటే మనవి తీస్కునే రేంజ్ లో ఉంటది.ఇచ్చే వాడే పాలకుడు ఐతాడు కానీ తీస్కునే వాడు ఎప్పటికి సేవకుడు ఐతాడు అనే చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా బాజీ రెడ్డి గారు.
ఫైనల్ గా లీడర్స్ అవ్వడం అనేది బేసిక్ గా ఒక మైండ్సెట్ లాంటిది. అది పెద్దల ఆర్థిక పరి పుష్టత వల్ల సహజం గా వచ్చే అవకాశాలు ఎక్కువ. మనది బేసిక్ గా బంక జాతి. ఆశ ఎక్కువ..ఆశయం తక్కువ. ఇలా ఉన్నంత కాలం 'మనోడు ఎవరైనా ఎదిగితే ఓర్చుకోలేం' అనే ఆలోచనకు మన జాతి ఒక బ్రాండ్ అంబసిడర్ గాను, జాతికి తిరుగులేని ఐడెంటిటీ గా కొనసాగుతుంది.
ఆత్మ గౌరవం, నాయకత్వం అనేవి అంత సులభం గా రావు, అవి చాలా అవకాశాల్ని బలి కోరుతాయి.
ఇలాంటివి ఎన్ని చెప్పిన ఏమి మారదు అని తెలిసి కూడా రాస్తున్న సగటు కాపు /బలిజ యువకుడు.