అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. సికింద్రాబాద్ సమీపంలో ఈరోజు పొద్దున్నే ఈ సినిమా షూట్ స్టార్ట్ అయింది. ఈ షెడ్యూల్ కోసం ఓ చిన్న అడవి సెట్ తో పాటు.. లారీలు నిలిపి ఉంటే స్థలాన్ని పోలిన మరో సెట్ వేశారు.
ఈ షెడ్యూల్ లో 45 రోజుల పాటు పుష్ప షూటింగ్ కొనసాగించాలని యూనిట్ ప్రాధమికంగా భావిస్తోంది. కరోనా పరిస్థితులు తగ్గితే ఇదే షెడ్యూల్ లో రంపచోడవరం అడవుల్లోకి కూడా వెళ్లాలనేది యూనిట్ ఆలోచన.
పుష్ప సినిమా రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ కు సంబంధించిన సీన్స్ అన్నింటినీ ఈ షెడ్యూల్ లో పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.
గతంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ తెగించి పుష్ప షూటింగ్ చేశారు. ఇంకా చెప్పాలంటే, టాలీవుడ్ లో ఆఖరి నిమిషం వరకు షూటింగ్ జరుపుకున్న పెద్ద సినిమా పుష్ప మాత్రమే. అప్పటికీ ఇంకా కొనసాగించాలనే అనుకున్నారు. కానీ బన్నీకి కరోనా సోకడంతో మొత్తం వ్యవహారాలు పక్కనపెట్టేశారు.
అలా ఆగిపోయిన పుష్ప సినిమా షూటింగ్, ఈరోజు మళ్లీ మొదలైంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రష్మిక హీరోయిన్. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత పుష్ప-1 రిలీజ్ డేట్ పై ఓ స్పష్టత వస్తుంది.