రూ.25 ల‌క్ష‌లు రా ర‌మ్మంటోంది … కండీష‌న్స్ అప్లై

సుల‌భంగా డ‌బ్బు సంపాదించ‌డం ఎలా? అనే అంశంపై సోష‌ల్ మీడియాలో పెద్ద లెక్చ‌ర‌ర్లు ఇస్తుండ‌డం చూశాం. అనేక కార‌ణాల రీత్యా క‌ష్టాల్లో ఉన్న మ‌నిషి…. ఇలాంటి ప్ర‌క‌ట‌న‌ల ప‌ట్ల వెంట‌నే ఆక‌ర్షితుడ‌వుతుంటాడు. డ‌బ్బంటే ఎవ‌రికి…

సుల‌భంగా డ‌బ్బు సంపాదించ‌డం ఎలా? అనే అంశంపై సోష‌ల్ మీడియాలో పెద్ద లెక్చ‌ర‌ర్లు ఇస్తుండ‌డం చూశాం. అనేక కార‌ణాల రీత్యా క‌ష్టాల్లో ఉన్న మ‌నిషి…. ఇలాంటి ప్ర‌క‌ట‌న‌ల ప‌ట్ల వెంట‌నే ఆక‌ర్షితుడ‌వుతుంటాడు. డ‌బ్బంటే ఎవ‌రికి చేదు? అవ‌కాశం ఉన్న‌ప్పుడు ప‌ది రూపాయ‌లు కూడ‌బెట్టాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ ఆలోచిస్తుంటారు. ఈ నేప‌థ్యంలో ఒక్క రూపాయి నాణెంతో రూ.25 ల‌క్ష‌లు సొంతం చేసుకునే అద్భుత అవ‌కాశం క‌ళ్లెదుటే ఉంది.

అయితే ఇక్క‌డ‌ కండీష‌న్స్ అప్లై అవుతాయి. ఒక్క రూపాయి నాణేనికి రూ.25 ల‌క్ష‌లు ఇవ్వ‌డం ఎంత నిజ‌మో, అది ద‌క్క‌డం కూడా అంతా ఆషామాషీ కాదు. స‌ద‌రు రూపాయి నాణెం క‌నీసం వందేళ్ల క్రితం నాటిదై ఉంటాలి. 1913 నాటి రూపాయి నాణేన్ని క‌లిగి ఉంటే మాత్రం …రూ.25 ల‌క్ష‌ల జాక్‌పాట్ కొట్టిన‌ట్టే. పురాత‌న నాణేల‌ను వేలం వేసేందుకు మ‌న దేశంలో ఇండియా మార్ట్ అనే పెద్ద సంస్థ ఉంది.

ఎవ‌రి వ‌ద్దైనా పురాత‌న , అపురూప నాణెం ఉంటే ఈ సంస్థ ద్వారా చ‌క్క‌గా వేలం వేసి కావాల్సినంత డ‌బ్బు సొంతం చేసు కోవ‌చ్చు. కాగా వెండితో రూపొందిన విక్టోరియా కాలం నాటి రూపాయి నాణేల ధరను ఇండియామార్ట్‌పై రూ 25 లక్షలుగా నిర్ణయించారు.

ఇదే కాదు, 1818లో ఈస్టిండియా కంపెనీ తయారు చేసిన నాణెం ఖరీదును ఇండియామార్ట్‌పై రూ 10 లక్షలుగా రేటు ఫిక్స్ చేశారు.  ఈ అరుదైన పురాతన నాణెంపై హనుమాన్ ఫొటో  ఉంటుంది. అరుదైన నాణేలను సొంతం చేసుకునేందుకు భారీ మొత్తంలో చెల్లించేందుకు చాలా మంది ఉండ‌డం విశేషం. ఇంకెందుకు ఆల‌స్యం … పురాత‌న త‌వ్వ‌కాలు చేప‌ట్టి క‌నీసం ఒక్క నాణేన్ని చిక్కించుకున్నా జీవితం మారిపోతుంది.