సమంతలో ఈ మార్పు గమనించారా..?

నాగచైతన్యతో విడాకుల వ్యవహారంపై స్టేట్ మెంట్ ఇచ్చిన తర్వాత సమంత తీర్థయాత్రలకు వెళ్లొచ్చింది. వచ్చీ రాగానే తనదైన స్టైల్ లో ఫొటోలు దిగి అందరినీ మైమరపించింది. కట్ చేస్తే సమంతలో ఓ కొత్త మార్పు…

నాగచైతన్యతో విడాకుల వ్యవహారంపై స్టేట్ మెంట్ ఇచ్చిన తర్వాత సమంత తీర్థయాత్రలకు వెళ్లొచ్చింది. వచ్చీ రాగానే తనదైన స్టైల్ లో ఫొటోలు దిగి అందరినీ మైమరపించింది. కట్ చేస్తే సమంతలో ఓ కొత్త మార్పు కనిపిస్తోంది. విడాకుల తర్వాత సమంతకు ఎవరు అవకాశాలిస్తారు, నాగచైతన్య మాజీ భార్యకు ఎన్టీఆర్ ఛాన్సిస్తారా, రామ్ చరణ్ కలసి నటిస్తానంటారా, మహేష్ బాబు హీరోయిన్ గా తీసుకుంటారా..? అనే డౌటనుమానాలు చాలానే వినిపించాయి. అసలు సమంతే టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్ కి చెక్కేస్తుందని అనుకున్నారు కూడా. కానీ సమంత తన అడ్రెస్ మార్చాలనుకోలేదు. ఆమె తెలుగు ఇండస్ట్రీతో మరింతగా బంధం పెంచుకోవాలనుకుంటోంది.

ఇటీవల సమంత వరుస ట్వీట్లు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఓటీటీ, డిజిటల్ మార్కెటింగ్ ఇన్నోవేషన్ అవార్డ్ లలో సమంత సత్తా చూపిన సందర్భంగా.. సినీ విశ్లేషకులు, జర్నలిస్ట్ లు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వారందరికీ పేరు పేరునా ట్విట్టర్ లో ఆమె కృతజ్ఞతలు తెలిపింది. గతంలో సమంత ఎవరికీ ఇంత ఇదిగా రిప్లై ఇచ్చింది లేదు. కానీ తొలిసారిగా ఆమెలో అందర్నీ కలుపుకొని వెళ్లాలనే ఆతృత కనిపించింది.

అంతే కాదు.. ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు పాటకి కూడా నిమిషాల వ్యవధిలోనే రిప్లై ఇచ్చింది. మెంటల్… అంటూ తన రివ్యూ స్టేట్ మెంట్ ఇచ్చేసింది. తారక్, రాజమౌళి, చరణ్ ని కూడా ట్యాగ్ చేసింది. అంటే సమంతకి ఇంకా తెలుగు ఇండస్ట్రీతోనే ఉండాలనే కోరిక, తెలుగు నటీనటులు, టెక్నీషియన్లతో మంచి రిలేషన్ కొనసాగించాలనే ఆశ ఉన్నట్టు అర్థమవుతోంది.

సమంత అందరిలా కాదు..

వివాహ బంధం ముగిసిపోయిన తర్వాత చాలామంది అమ్మాయిలు మూడీగా ఉంటారు, తిరిగి రోజువారీ వ్యవహారాల్లోకి రావడానికి చాలా సమయం తీసుకుంటారు. కానీ సమంత అలా కాదు, రోజుల వ్యవధిలోనే అన్నీ సెట్ రైట్ చేసుకుంది. మెంటల్లీ ప్రిపేర్ అయిపోయింది. ఆ మాటకొస్తే.. విడాకుల ప్రకటనకి ముందు నుంచీ సమంత ప్లాన్డ్ గా వ్యవహరిస్తోంది.

సమంత వ్యవహారం చూస్తుంటే.. పెళ్లైన తర్వాత తగ్గించిన గ్లామర్ రోల్స్ ని మరోసారి ఒడిసి పట్టేయడానికి ప్లాన్ చేస్తోంది. ఓవైపు ఫ్యామిలీ మ్యాన్ లాంటి సీరియస్ క్యారెక్టర్స్ చేస్తూనే, మరోసారి టాలీవుడ్ నెంబర్-1 అవ్వడానికి అవకాశాలు వెదుక్కుంటోంది. కాజల్, తమన్నా, ననయతార.. వీరంతా తప్పుకోవడం, పూజా హెగ్డే, రష్మిక లాంటి వాళ్లనే పెద్ద హీరోలు పదే పదే రిపీట్ చేయడం వంటి ఈ సిచ్యుయేషన్లో సమంత రీఎంట్రీ ఎలాంటి అవకాశాలను తెస్తుందో చూడాలి.

అప్పుడే మొదలైన పుకార్లు

టాలీవుడ్ లో మరోసారి నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్న సమంతపై అప్పుడే పుకార్లు కూడా మొదలయ్యాయి. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న భారీ సినిమాలో సమంతనే హీరోయిన్ గా తీసుకునే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. మహేష్-సమంతది హిట్ కాంబినేషన్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, దూకుడు లాంటి సినిమాలు చేశారు. బ్రహ్మోత్సవం డిజాస్టర్ అయినప్పటికీ ఈ పెయిర్ కున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. సో.. మరోసారి మహేష్-సమంత కలిసి సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే కచ్చితంగా బజ్ ఉంటుంది. సమంత కూడా అలాంటి బిగ్ ఆఫర్ల కోసమే వెయిటింగ్. ఈ మేరకు ఆమె ఇప్పటికే పలు ప్రొడక్షన్ కంపెనీలు, దర్శకులతో టచ్ లోకి వెళ్లింది.