బాబుని ఇంతలా గద్దించిన వారు లేరుగా..?

చంద్రబాబు వయసులో పెద్దవారు, అనుభవంలోనూ సీనియర్. ముమ్మారు సీఎంగా చేసిన బాబు మరో ముమ్మారు విపక్ష నేతగా ఉన్నారు. సరే ఇవన్నీ పక్కన పెడితే ఎదుటి వారి నుంచి మన్నన పొందాలంటే హుందాతనం కూడా…

చంద్రబాబు వయసులో పెద్దవారు, అనుభవంలోనూ సీనియర్. ముమ్మారు సీఎంగా చేసిన బాబు మరో ముమ్మారు విపక్ష నేతగా ఉన్నారు. సరే ఇవన్నీ పక్కన పెడితే ఎదుటి వారి నుంచి మన్నన పొందాలంటే హుందాతనం కూడా అవసరమే. బాబు పదే పదే అదే చెబుతారు కూడా. హుందాగా రాజకీయాలు చేయాలని కోరే చంద్రబాబు తాను మాత్రం  దిగజారుతారు.

సంచయితగజపతిరాజు తన జోలికి రావద్దు అని ఇప్పటికే ఎన్నో సార్లు ఇద్దరు బాబులకూ చెబుతూ వస్తున్నారు. కానీ పాత పాటే పాడుతూ లేనిది ఉన్నట్లుగా ప్రచారం చేస్తూంటే చూస్తూ ఊరుకోవడానికి ఆమె పాతతరం రాజకీయ నాయకురాలు కాదు, నవీన తరం ప్రతినిధి. అందుకే బాబుకు గట్టిగానే రిటార్ట్ ఇచ్చేశారు.

మాన్సాస్ మీద బురద జల్లుతున్న బాబుని క్షమాపణలు చెప్పమంటూడిమాండ్ చేశారు. మాన్సాస్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలేదని, రోడ్డున పడ్డారంటూ మొన్న లోకేష్ ట్వీట్ చేస్తే అదిరిపోయే రేంజిలో సంచయిత జవాబు చెప్పారు. దెబ్బకు చినబాబు నుంచి సౌండ్ లేదు.

ఇపుడు అదే పాచిపోయిన న్యూస్ ని పట్టుకుని ఎంతటి ట్రస్ట్ ఇలా అయిపోయిందంటూ బాబు బోలేడు సానుభూతి ఒలకబోశారు. మాన్సాస్ వైభవం, ప్రాభవం ఇంతేనా అంటూ ఏదేదో ట్వీటారు. దీంతో మాన్సాస్ చైర్ పర్సన్ సంచయితకు బాగా మండుకొచ్చింది. చినబాబుకు జవాబు చెప్పాను, దాన్ని కాపీ చేసి చూసుకోండంటూ పెదబాబుకు కౌంటరిచ్చారు.

అంతేకాదు, మాన్సాస్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని ఎవరు చెప్పారు. అందరికీ ఇచ్చాం, పాత వార్తను పట్టుకుని బురద జల్లుతారా అని సంచయిత బాబు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగలేదు. గత అయిదేళ్ల కాలంతో తన బాబాయి, చంద్రబాబుల  ఏలుబడిలోనే మాన్సాస్ ట్రస్ట్ ఇలా దిగజారిందని కూడా లోగుట్టు బయటపెట్టారు.

ఇపుడు అంత సర్దుబాటు చేస్తున్నామని, మాన్సాస్ ట్రస్ట్  వైభవానికి ఢోకా లేదని కూడా స్పష్టం చేశారు. ఇలా అవాస్తవాలను అదే పనిగా  ప్రచారం చేస్తున్న బాబు సారీ చెప్పాలని కూడా సంచయిత డిమాండ్ చేయడం సంచలనమే. మరి బాబు ఇకనైనా మాన్సాస్ పేరు తలవక ఊరుకుంటారా. కొన్నాళ్ళు ఆగి మళ్లీ పాత పాటే పాడుతారా.

మట్టి గణపతిని ఎంత శ్రద్ధగా చేసాడో

కమ్మ వారికి చంద్రబాబు చేస్తున్న నష్టం ఎంత