త‌బ్లిగీ పై సౌదీ నిషేధం.. ఇండియా దృష్టి పెట్టాలి!

త‌బ్లిగీ జమాత్ పై నిషేధం విధించింది ఇస్లామిక్ దేశం సౌదీ అరేబియా. త‌బ్లిగీ ని ఉగ్ర‌వాదానికి ముఖ‌ద్వారంగా కూడా ఆ దేశం అభివ‌ర్ణించ‌డం గ‌మ‌నార్హం. ఇస్లామిక్ సంప్ర‌దాయాల‌ను కాపాడ‌ట‌మే ల‌క్ష్యమ‌ని చెప్పుకునే ఈ సంస్థ‌ను ఒక…

త‌బ్లిగీ జమాత్ పై నిషేధం విధించింది ఇస్లామిక్ దేశం సౌదీ అరేబియా. త‌బ్లిగీ ని ఉగ్ర‌వాదానికి ముఖ‌ద్వారంగా కూడా ఆ దేశం అభివ‌ర్ణించ‌డం గ‌మ‌నార్హం. ఇస్లామిక్ సంప్ర‌దాయాల‌ను కాపాడ‌ట‌మే ల‌క్ష్యమ‌ని చెప్పుకునే ఈ సంస్థ‌ను ఒక ఇస్లామిక్ దేశ‌మే నిషేధించింది. మ‌ధ్య‌యుగం నాటి ఇస్ల‌మిక్ సంప్ర‌దాయాల‌ను ఫాలో అయ్యే దేశ‌మే.. త‌బ్లిగీని ఉగ్ర‌వాదానికి ముఖ‌ద్వారంగా అభివ‌ర్ణించింది. 

ఒక‌వేళ ఏ అమెరికానో, మ‌రో యూరోపియ‌న్ దేశ‌మో, ఇండియానో.. త‌బ్లిగీని నిషేధించి ఉంటే.. చాలా మంది అభ్యంత‌రాలు చెప్పేవాళ్లు. ఇస్లామోఫోబియా అంటూ వ్యాక్యానించే వారు. అయితే త‌బ్లిగీనీ నిషేధించింది ఒక ఇస్లామిక్ దేశం కావ‌డంతో చాలా మంది కిక్కురుమ‌నే ప‌రిస్థితుల్లో లేరు.

ఇక ఈ అంశంపై భార‌త్ కూడా దృష్టి పెట్టాల్సి ఉంది. ఉగ్ర‌వాదం, మ‌తోన్మాదం వంటివి ఏ మ‌తంలో ఉన్నా వాటిని ఖండించి వేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఇండియాలో త‌బ్లిగీకి విప‌రీత‌మైన నెట్ వ‌ర్క్ ఉంద‌ని స్ప‌ష్టం అవుతూనే ఉంది. క‌రోనా ఫ‌స్ట్ వేవ్ స‌మ‌యంలో ఢిల్లీలో త‌బ్లిగీ నిర్వ‌హించిన ఒక కార్య‌క్ర‌మం ద్వారానే దేశం న‌లుమూల‌ల‌కూ క‌రోనా వ్యాపించింది.

ఆ స‌మావేశంలో పాల్గొన్న‌వారి వ‌ల్ల‌నే ఇండియాలో క‌రోనా వ‌చ్చింద‌న‌లేం కానీ, క‌రోనాకు ట్రీట్ మెంట్ ఏమిటో కూడా అంతుబ‌ట్ట‌ని స్థితిలో..తబ్లీగీ స‌మావేశాల్లో పాల్గొన్న వారు దేశం న‌లుమూల‌ల‌కూ ప్ర‌యాణించి.. క‌రోనాను వీలైనంత‌గా వ్యాపింప‌జేసిన వారిలో ఉన్నారు.

ఎక్క‌డో మారుమూల గ్రామాల నుంచి కూడా ఢిల్లీకి త‌బ్లిగీ మ‌త స‌మావేశాల‌కు వెళ్లిన వారు ఉన్నారంటే అప్పుడు చాలా మంది ఆశ్చ‌ర్య‌పోయారు. ఆ త‌బ్లిగీనే ఇప్పుడు సౌదీ నిషేధించింది. మ‌రి ఇండియాలో ఈ సంస్థ కార్య‌క‌లాపాలు ఎలా ఉన్నాయి?  కేవ‌లం సంప్ర‌దాయాల‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేస్తోందా లేక అంత‌కు మించి ఏం జ‌రుగుతోంద‌నే అంశం గురించి భార‌త ప్ర‌భుత్వం దృష్టి సారించాల్సి ఉంది.

ఏ మతాన్నీ ఉగ్ర‌వాదం అంటూ ద్వేషించాల్సిన ప‌ని లేదు, అదే స‌మ‌యంలో ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల గురించి వీలైనంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌ర‌మూ ఉంది. సౌదీ బ్యాన్ నేప‌థ్యంలో… త‌బ్లీగీ కార్య‌క‌లాపాల‌పై భార‌త ప్ర‌భుత్వం దృష్టి సారించాల్సిన అవ‌స‌రం సీరియ‌స్ గా క‌నిపిస్తోంది.