సీబీఐ అదుపులో వైఎస్ అవినాష్ నీడ‌…నెక్ట్స్‌?

వివేకా హ‌త్య కేసులో కీల‌క ప‌రిణామం. నిందితుడు ద‌స్త‌గిరి వాంగ్మూలంలో హ‌త్య వెనుక డి.శంక‌ర్‌రెడ్డితో పాటు వైఎస్ కుటుంబ స‌భ్యుల పేర్లు చెప్పిన సంగ‌తి తెలుసు.  Advertisement ఈ నేప‌థ్యంలో దేవిరెడ్డి శంక‌ర్‌రెడ్డి అలియాస్…

వివేకా హ‌త్య కేసులో కీల‌క ప‌రిణామం. నిందితుడు ద‌స్త‌గిరి వాంగ్మూలంలో హ‌త్య వెనుక డి.శంక‌ర్‌రెడ్డితో పాటు వైఎస్ కుటుంబ స‌భ్యుల పేర్లు చెప్పిన సంగ‌తి తెలుసు. 

ఈ నేప‌థ్యంలో దేవిరెడ్డి శంక‌ర్‌రెడ్డి అలియాస్ దొండ్ల‌వాగు శంక‌ర్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఈయ‌న క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డికి అత్యంత స‌న్నిహితుడిగా పేరు పొందాడు. అవినాష్‌కు నీడ అని ఈయ‌న గురించి చెబుతారంటే, వాళ్లిద్ద‌రు ఎంతో స‌న్నిహితులో అర్థం చేసుకోవ‌చ్చు.

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్సలో ఉండగా సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన‌ట్టు స‌మాచారం. అనంతరం అతడిని న‌గ‌రంలోని సీబీఐ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇదిలా వుండ‌గా ద‌స్త‌గిరి వాంగ్మూలం మేర‌కు శంక‌ర్‌రెడ్డిని అరెస్ట్ చేయ‌డంతో మున్ముందు మ‌రికొన్ని అరెస్ట్‌లు ఉండొచ్చ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. 

ద‌స్త‌గిరి వాంగ్మూలంలో వైఎస్ అవినాస్‌రెడ్డి, ఆయ‌న తండ్రి భాస్క‌ర్‌రెడ్డి, చిన్నాన్న మ‌నోహ‌ర్‌రెడ్డి పేర్లు ఉండ‌డంతో, వారి అరెస్ట్‌పై కూడా ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇదిలా వుండ‌గా వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు ఇచ్చిన అనుమానితుల్లో అవినాష్‌రెడ్డి, భాస్క‌ర్‌రెడ్డి, శంక‌ర్‌రెడ్డి పేర్లున్న సంగ‌తి తెలిసిందే. 

ఇప్ప‌టికే సీబీఐ ప‌లు ప‌ర్యాయాలు శివశంకర్‌రెడ్డి విచారించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రోసారి శంక‌ర్‌రెడ్డిని అదుపులోకి తీసుకోవ‌డంతో అస‌లేం జ‌రుగుతోంద‌నే చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది.