సహ నటుడి చెంప చెళ్లుమని కొట్టింది ఓ నటి. ఇదంతా లైవ్‌లో చోటు చేసుకోవడం గమనార్హం. దీంతో ఈ వీడియో సోషల్ మీడి యాలో వైరల్ అవుతోంది. ఆసక్తికర ఈ వీడియో వెనుక అసలు కథేంటో తెలుసుకుందాం.
హిందీ నటులు షెహనాజ్ గిల్ – సిధార్థ్ శుక్లా…బిగ్‌బాస్-13తో బాగా పాపులర్ అయ్యారు. సినిమాలు, సీరియల్స్‌లో ఎన్ని పాత్రలు వేసినా బిగ్‌బాస్ రియాల్టీ షో ఇచ్చే గుర్తింపునకు సాటిరావు. ఎందుకంటే రియాల్టీ షోలో రియల్ క్యారెక్టర్ ఏంటో ప్రేక్షకులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక షెహనాజ్ -సిధార్థ్ విషయానికి వస్తే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకి వినోదాన్ని పంచుతుంటారు.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సిద్‌నాజ్’ పేరుతో అభిమానులతో లైవ్ సెషన్ నిర్వహించారు. లైవ్‌లో ప్రత్యక్షంగా చూస్తోన్న అభిమాను లను ఉద్దేశించి సిధార్థ్ మాట్లాడుతూ… ‘చూడండి మేం ఇద్దరం కలిసే ఉన్నాం. మరి మీరు దేని గురించి గొడవ పడుతున్నారు? ఆందోళన చెందుతున్నారు’ అని ప్రశ్నించాడు.
కొందరు కావాలనే తమపై విష ప్రచారం చేస్తూ ద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారని.. అలాంటి వారిని పట్టించుకోవద్దని కోరారు. లైవ్‌లో సిధార్థ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా…అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యే సంఘటన చోటు చేసుకొంది.
సిధార్థ్ పక్కనే ఉన్న షెహ్‌నాజ్ అతడి చెంప చెళ్లుమనిపించడంతో లైవ్‌లో ఉన్న అభిమానులు కొంతసేపు షాక్‌కు గురయ్యారు. అంతలోనే షెహ్‌నాజ్ స్పందిస్తూ అభిమానులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. ‘అబ్బే సీరియస్‌గా కాదులే. ట్రోల్ చేసే వారికి మీరు ఇలానే సమాధానం చెప్పండి’ అని సంకేతం ఇచ్చేందుకు ఇలా చేశానని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరలవుతోంది.