మీడియా Vs సోషల్ మీడియా: పాదయాత్ర స్మృతులు

తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయగల నేర్పు మీడియాకి ఉంది. అలాంటి మీడియాని మహ బాగా మేనేజ్ చేయగల నేర్పు చంద్రబాబుకి ఉంది.  Advertisement అయితే ప్రజా సంకల్ప యాత్ర సమయానికల్లా సోషల్ మీడియా…

తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయగల నేర్పు మీడియాకి ఉంది. అలాంటి మీడియాని మహ బాగా మేనేజ్ చేయగల నేర్పు చంద్రబాబుకి ఉంది. 

అయితే ప్రజా సంకల్ప యాత్ర సమయానికల్లా సోషల్ మీడియా జగన్ కి అండగా నిలబడింది. ఎల్లో మీడియాను సమర్థంగా తిప్పికొట్టింది. 

జగన్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. మరోసారి సోషల్ మీడియా ఆ తీపి గుర్తుల్ని నెమరు వేసుకుంటోంది.

ప్రజా సంకల్ప యాత్ర మూడేళ్ల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా పూర్తిగా దీన్ని పక్కనపెట్టేసింది. అయితేనేం సోషల్ మీడియా ఉంది కదా. శుభాకాంక్షలు, ఆనందోత్సాహాలు.. అన్నీ అందులోనే కనపడుతున్నాయి. 

గతంలో జగన్ వెంట నిలబడ్డవారు, నడచినవారు, సెల్ఫీలు దిగినవాళ్లు.. అందరూ ఆ ఆనందాన్ని మరోసారి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. 

ఫేస్ బుక్, ట్విట్టర్, ఇనస్టాగ్రామ్.. ఏది చూసినా.. జగనే, జగన్ తో అభిమానులు దిగిన ఫొటోలు, పాదయాత్ర మధుర స్మృతులే కనిపిస్తున్నాయి.

మూడేళ్ల క్రితం కూడా జగన్ పాదయాత్రను మెయిన్ స్ట్రీమ్ మీడియా కావాలని పక్కనపెట్టిన సందర్భంలో సోషల్ మీడియానే వైసీపీకి అండగా నిలబడింది. 

జగన్ ప్రతి కదలికను ప్రపంచానికి చూపించింది. ప్రపంచంలో రాజశేఖర్ రెడ్డి అభిమానులు, జగన్ అనుచరులు ఎక్కడ ఉన్నా.. ఎప్పటికప్పుడు అప్ డేట్ అందించింది. 

జగన్ ఏ నిమిషం ఏ ఊరిలో ఉన్నారు, ఏ మలుపు దాటారు, జగన్ యాత్ర ఎక్కడికి చేరుకుంది.. అన్నీ క్షణాల్లో కార్యకర్తలకు, అభిమానులకు చేరేవి. 

ఎక్కడికక్కడ విమర్శలు చేస్తూ, పాదయాత్రను అడ్డుకోవాలని టీడీపీ, చంద్రబాబు అను'కుల' మీడియా ప్రయత్నించినా కూడా ఫలితం లేదు. 

అరచేతిని అడ్డంపెట్టి సూర్యుడిని ఆపలేరన్నట్టుగా.. చేతిలో ఉన్న మీడియాను అడ్డు పెట్టుకుని జగన్ కి వస్తున్న పాపులార్టీని అడ్డుకోవడం చంద్రబాబు తరం కాలేదు. 

బాబు ఎంతగా తొక్కాలని చూస్తే.. అంతగా ప్రజా సంకల్ప యాత్ర ప్రజల్లోకి వెళ్లిపోయింది. సోషల్ మీడియా పవర్ ఏంటో చంద్రబాబుకి తెలిసొచ్చేలా చెప్పింది.

అలనాటి పాదయాత్ర గురుతులు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. ఈ సందర్భంగా అప్పటి బాబు అరాచకాలు, అబద్ధపు హామీలు ఇంకోసారి ఫేస్ బుక్, ట్విట్టర్ లో హైలెట్ అవుతున్నాయి.

కంగ‌నాపై ముంబైలో ఒక కేసు