స్టీల్ ప్లాంట్ వాల్యూ లెక్కేట్టేస్తున్నారు… ?

విశాఖ స్టీల్ ప్లాంట్ బలి పీఠం మీదనే ఉంది. దాన్ని బయటకు తీసే పని అసంభవం, అసాధ్యమేనా అంటే జవాబు నిరాశగానే వస్తోంది. ఇదిలా ఉంటే స్టీల్ ప్లాంట్ వాల్యూ ఎంత అన్న లెక్కలు…

విశాఖ స్టీల్ ప్లాంట్ బలి పీఠం మీదనే ఉంది. దాన్ని బయటకు తీసే పని అసంభవం, అసాధ్యమేనా అంటే జవాబు నిరాశగానే వస్తోంది. ఇదిలా ఉంటే స్టీల్ ప్లాంట్ వాల్యూ ఎంత అన్న లెక్కలు తీయడం ఏకంగా వాల్యూయేషన్ కమిటీ ప్లాంట్ కి ఈ నెల 12న వస్తోంది. అలాగే కేంద్రం నియమించిన అడ్వైజర్ కమిటీ కూడా ప్లాంట్ కి వచ్చేస్తోంది.

మరి కేంద్రం దూకుడు చూస్తూంటే కధ మరింతగా క్లైమాక్స్ కి చేరుకుంటోందా అన్న అనుమానాలు అయితే వస్తున్నాయి. అయితే ఈ రెండు కమిటీ ప్రతినిధులను ప్లాంట్ గేట్ కూడా తాకకుండా అడ్డుకుంటామంటూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ హెచ్చరిస్తోంది.

స్టీల్ ప్లాంట్ ముట్టడికి కూడా ఉద్యమ సంఘాలు పిలుపు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ని ఇపుడు రక్షించుకోకపోతే మరెప్పుడూ కాదు అని కూడా జేఏసీ చైర్మన్ సీహెచ్ నరసింగరావు అంటున్నారు. స్టీల్ ప్లాంట్ కి గతంలో కూడా కొన్ని కమిటీలు రావడానికి చూసాయి. వాటిని అడ్డుకున్నారు. మరి ఈసారి ఏం జరుగుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే స్టీల్ ప్లాంట్ కి అటు కమిటీ సభ్యులు వస్తే ఇటు ఉద్యమ కారులు వారిని అడ్డుకోవడానికి చూస్తే  ప్లాంట్  పరిసరాలలో తీవ్ర ఉద్రిక్తతలే చోటు చేసుకుంటాయని అంటున్నారు. మొత్తానికి స్టీల్ ప్లాంట్ విషయంలో చకచకా అన్నీ జరుగుతున్నాయి. 

కోటి సంతకాల సేకరణతో ఒక వైపు ప్రజా మద్దతుని ఉద్యమ కమిటీ నేతలు సేకరిస్తున్న నేపధ్యం ఉండగానే మరో వైపు కమిటీ కూడా రావడానికి చూడడం అంటే స్టీల్ ప్లాంట్ ఫ్యూచర్ ఏంటన్నది మాత్రం అర్ధం కావడంలేదు అన్నదే అందరి వేదనగా ఉంది.