తల్లిదండ్రుల్లో భయం.. ఆ పాపం కూడా టీడీపీదే

ఏపీలో పాఠశాలలు తెరిచేందుకు, అనుమతినిచ్చిన వైసీపీ ప్రభుత్వం, స్థానిక ఎన్నికల విషయంలో ఎందుకు వెనకడుగేస్తోందనేది టీడీపీ వాదన. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలపై దుష్ప్రచారం చేసేందుకు కూడా వెనకాడ్డంలేదు ఆ పార్టీ.  Advertisement పచ్చపాత…

ఏపీలో పాఠశాలలు తెరిచేందుకు, అనుమతినిచ్చిన వైసీపీ ప్రభుత్వం, స్థానిక ఎన్నికల విషయంలో ఎందుకు వెనకడుగేస్తోందనేది టీడీపీ వాదన. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలపై దుష్ప్రచారం చేసేందుకు కూడా వెనకాడ్డంలేదు ఆ పార్టీ. 

పచ్చపాత మీడియా, దానికి అనుబంధ సోషల్ మీడియాలో.. విద్యార్థులు-కరోనా కేసులు అంటూ పెద్ద రచ్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏయే స్కూళ్లలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా సోకిందో హైలెట్ చేస్తూ వార్తలిస్తున్నారు.

వాస్తవాలు దాచొద్దని ఎవరూ చెప్పరు కానీ, అదే సమయంలో ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలని చూడటం మాత్రం ఆక్షేపణీయం. వాస్తవానికి స్కూళ్లు తెరిచే రోజే.. అందరికీ కరోనా పరీక్షలు చేశారు. వారిలో చాలామందికి నెగెటివ్ వచ్చింది, కొందరికి పాజిటివ్ వచ్చింది. 

ఇలా పాజిటివ్ వచ్చినవారి శాతం 1కంటే తక్కువే. అంటే రాష్ట్రంలో ప్రతి రోజూ కొత్తగా నమోదవుతున్న కేసులతో పోల్చి చూస్తే ఇది చాలా చాలా తక్కువ. మరి దీనికే రాద్ధాంతం ఎందుకు.

స్కూల్ లో పరీక్షలు చేసే సమయానికే ఉపాధ్యాయుల్లో కొందరికి, విద్యార్థులకు ఆల్రడీ కరోనా సోకి ఉంటుంది. అది స్కూళ్లు తెరిచే రోజు బైటపడింది. మరి స్కూళ్లు తెరవడం వల్ల కరోనా కేసులు పెరుగుతున్నాయనే దుష్ప్రచారం ఎందుకు? ఏపీలో తిరిగి స్కూళ్లు మూసేస్తారంటూ పుకార్లు షికార్లు చేస్తున్న వేళ.. ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేసేదే లేదని తేల్చి చెబుతోంది.

ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్లు పాఠశాలలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. కొత్తగా కరోనా కేసులు వచ్చినచోట కొన్ని రోజుల పాటు సెలవులు ఇచ్చినా వారందరికీ ఆన్ లైన్ క్లాసులు అందుబాటులో ఉండేలా ప్రోత్సహిస్తున్నారు. 

ప్రతి స్కూల్ లో పిల్లలకు శానిటైజేషన్ అలవాటు చేస్తున్నారు. కరోనా పట్ల అవగాహన పెంచుకోడానికి, మంచి ఆరోగ్య అలవాట్లు నేర్చుకోడానికి పిల్లలకు స్కూల్ ని మించిన ప్రదేశం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు.

అందులోనూ కేవలం 150 పని దినాలతో ఈ ఏడాది సిలబస్ పూర్తి చేసి, తక్కువ సిలబస్ పైనే పరీక్షలు నిర్వహించబోతున్నారు. దీనికి కూడా అడ్డంపడి.. విద్యార్థుల భవిష్యత్ ని నాశనం చేయాలని చూడటం, అది కూడా కేవలం స్థానిక ఎన్నికల కోసం ఇలా చేయడం టీడీపీకి ఎంతవరకు సమంజసం.

పిల్లల తల్లిదండ్రుల్లో అపోహలు సృష్టించాలనుకుంటున్నవారిపై ప్రభుత్వం కటిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు కరోనా కేసులంటూ లేనిపోని ప్రచారం చేస్తున్నవారిని ఓ కంట కనిపెట్టాలి. 

ఈనాడు-నిమ్మగడ్డ-చంద్రబాబు.. ఓ గూడు పుఠానీ