మెరుగ్గా ఫలితాలు సాధించిన టిడిపి నేతలు

టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం అయిన కుప్పంలో కన్నా, కొందరు టిడిపి నేతల నియోజకవర్గాలలో స్థానిక ఎన్నికల ఫలితాలు కాస్త మెరుగ్గా ఉండడం విశేషం. Advertisement టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు…

టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం అయిన కుప్పంలో కన్నా, కొందరు టిడిపి నేతల నియోజకవర్గాలలో స్థానిక ఎన్నికల ఫలితాలు కాస్త మెరుగ్గా ఉండడం విశేషం.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న చోట నాలుగు ఎంపీటీసీలను గెలిపించుకున్నారు. 

ధూళిపాళ్ల నరేంద్ర, చింతమనేని ప్రభాకర్, నిమ్మల రామానాయుడు, బండారు సత్యనారాయణమూర్తి లాంటి నాయకులు రెండంకెల ఎంపీటీసీలను సాధించారు. 

జెడ్పీటీసీల్లోనూ చంద్రబాబు పార్టీ నాయకుల కంటే బాగా వెనుకబడిపోయారు. కుప్పంలో నాలుగింటిలో ఒక్క జెడ్పీటీసీని కూడా గెలిపించుకోలేకపోయారు. 

ఆరు జిల్లాల్లో ఒక్కో జెడ్పీటీసీని మాత్రమే టీడీపీ గెలవగా ఏడు జిల్లాల్లో అసలు ఖాతా తెరవలేదు. ఆ ఏడు జిల్లాల్లో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు కూడా ఉంది. 

సీనియర్‌ నాయకుడు అయ్యన్నపాత్రుడు తన సొంత మండలం నర్సీపట్నంలో జెడ్పీటీసీని గెలిపించుకోగా చంద్రబాబు కుప్పంలో ఒక్క జెడ్పీటీసీని కూడా సాధించలేకపోయారు.