జెండా పీకేద్దాం.. ఆ ‘కమ్మ’ని కలానికి ఇప్పుడేమైంది!

జెండా పీకేద్దాం.. ఈనాడు వంటి పత్రికలో అలాంటి వార్త వస్తుందని అప్పటివరకూ ఎవరూ ఊహించలేదు. ఆ వార్త తర్వాతే ప్రజారాజ్యంలో మరిన్ని లుకలుకలు బయల్దేరి అనివార్యంగా కాంగ్రెస్ లో కలసిపోయింది. తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా…

జెండా పీకేద్దాం.. ఈనాడు వంటి పత్రికలో అలాంటి వార్త వస్తుందని అప్పటివరకూ ఎవరూ ఊహించలేదు. ఆ వార్త తర్వాతే ప్రజారాజ్యంలో మరిన్ని లుకలుకలు బయల్దేరి అనివార్యంగా కాంగ్రెస్ లో కలసిపోయింది. తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా చిరంజీవి బలపడుతున్నారనుకుంటున్న టైమ్ లో అసలు పార్టీయే లేకుండా చేశారు. పార్టీని నడపలేకపోవడం చిరంజీవి అసమర్థతా లేక, అలాంటి పరిస్థితిని సృష్టించారా అనే విషయం పక్కనపెడితే ప్రజారాజ్యం చరిత్రలో కలిసిపోయింది.

అప్పటి ప్రజారాజ్యం బలం 18 ఎమ్మెల్యే సీట్లు, ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి పడ్డ ఓట్లు 17. ఉమ్మడి రాష్ట్రం, నవ్యాంధ్ర అనే విషయం పక్కనపెడితే.. ఏపీలో తెలుగుదేశం పూర్తిగా కనుమరుగయ్యే దశకు చేరుకుంది. 23మంది ఎమ్మెల్యేల్లో ఆల్రెడీ ముగ్గురు వైసీపీలో చేరినంత పనిచేశారు, 'పదవులకు రాజీనామా' అనే కండిషన్ లేకపోతే.. అసలెంతమంది టీడీపీలో ఉంటారో కూడా తెలియదు. పార్టీలో లుకలుకల సంగతి చెప్పక్కర్లేదు.

అప్పుడు ప్రజారాజ్యంలో కానీ, రాష్ట్రంలో కానీ చిరంజీవి చరిష్మా ఏమాత్రం తగ్గలేదు, ఇప్పుడు ఏపీలో చంద్రబాబు అమావాస్య చంద్రుడే, టీడీపీలో చినబాబు మొద్దబ్బాయి మాత్రమే. సీట్లు లేవు, నాయకత్వం లేదు, ఒకరంటే ఒకరికి పొసగదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో టీడీపీ జెండా పీకేయాలా వద్దా? పచ్చపాత పత్రికలు అనిపించుకోకుండా ఉండాలంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఈ వార్త రావాలా వద్దా?

అప్పుడు ప్రజారాజ్యం జెండా పీకేసేదాకా నిద్రపోని మీడియా.. ఇప్పుడు టీడీపీని ఎందుకు వదిలిపెట్టింది. టీడీపీ జెండా పీకేద్దాం అని రాసే దమ్ము మీడియాకి ఉందా? చిరంజీవికి ఒక నీతి, చంద్రబాబుకి మరో నీతా?

పోనీ చంద్రబాబు సంగతి పక్కనపెడదాం, కనీసం జనసేన జెండా పీకేద్దామనే వార్త కూడా కనపడదు. ఎందుకంటే.. జనసేన ఉంటేనే టీడీపీ మనుగడ సాధ్యం అని చంద్రబాబు భావిస్తున్నారు కాబట్టి, పవన్-బాబు మద్య చీకటి ఒప్పందం ఉంది కాబట్టి. ఎన్నికల్లో ఓట్లు చీల్చేందుకు జనసేన లాంటి పార్టీ ఒకటి ఉండాలి కాబట్టి, అది చావకూడదు, అలాగని బతకకూడదు.. జస్ట్ మనుగడలో ఉండాలంతే. అందుకే టీడీపీ అనుకూల మీడియా జనసేన గురించి మాత్రం తప్పుగా రాయదు.

అలా మానసికంగా ప్రజారాజ్యాన్ని చంపేసిన మీడియా ఇప్పుడు టీడీపీని మాత్రం వెంటిలేటర్ పై పెట్టి చికిత్స అందిస్తోంది. రాష్ట్రంలో ఇంకా చంద్రబాబే సీఎం అన్నట్టుగా ఫ్రంట్ పేజీ వార్తలతో కలరింగ్ ఇస్తోంది. 'పచ్చ'పాత మీడియాకి రాసే దమ్ములేకపోవచ్చు కానీ, ఏపీ ప్రజలకి మాత్రం టీడీపీ జెండా పీకేసే దమ్ము, ధైర్యం రెండూ ఉన్నాయి. అందుకే గతేడాది 23ఇచ్చారు, వచ్చే దఫా సింగిల్ డిజిట్ కి పరిమితం చేస్తారు. 

అప్పుడిక “జెండా పీకేద్దాం” అంటూ టీడీపీపై వార్తలు రాయాలా వద్దా అనే సంశయం బాబు మీడియాకు ఉండదు. 

ముఠా నాయకుడు బైటకు రావాలి