Advertisement

Advertisement


Home > Politics - Telangana

మేము కూడా సీఎం రేస్‌లో ఉన్నాం!

మేము కూడా సీఎం రేస్‌లో ఉన్నాం!

తెలంగాణ‌లో సీఎల్పీ నేత ఎన్నిక జాప్య‌మ‌వుతోంది. తెలంగాణ‌లో 64 సీట్ల‌ను గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. సీఎంగా రేవంత్‌రెడ్డిని ఎన్నుకుంటార‌ని అంతా భావించారు. అయితే సీఎం ప‌ద‌విని ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండ‌డంతో కాంగ్రెస్ అధిష్టానానికి త‌ల‌నొప్పిగా మారింది. రేవంత్‌రెడ్డి మాత్ర‌మే కాదు... మేము కూడా సీఎం రేస్‌లో ఉన్నామంటూ మ‌రికొంద‌రు నేత‌లు బ‌హిరంగంగా త‌మ మ‌న‌సులో మాట చెబుతున్నారు.

ఇప్ప‌టికే సీఎం ప‌ద‌విని రేవంత్‌తో పాటు భ‌ట్టి విక్ర‌మార్క‌, ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆశిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా వీరికి మ‌రొక సీనియ‌ర్ నేత తోడ‌య్యారు. ఆయ‌నే శ్రీ‌ధ‌ర్‌బాబు. ఈయ‌న మంథ‌ని నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. గతంలో మంత్రిగా కూడా ప‌ని చేశారు.

తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో 64 మంది ఎమ్మెల్యేలు సీఎం అభ్య‌ర్థులే అన్నారు. అందులో తాను కూడా ఉన్న‌ట్టు మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్ట‌డం గ‌మ‌నార్హం. వీలైతే త‌న‌కు సీఎం అవ‌కాశం ఇవ్వాల‌ని ఆయ‌న అధిష్టానాన్ని కోరిన‌ట్టు స‌మాచారం. అయితే సీఎంగా ఎవ‌రుండాలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణ‌యిస్తుంద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.

ఇవాళ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం కావ‌డానికి త‌న‌కు అన్ని అర్హ‌త‌లున్నాయ‌న్నారు. తాను మొద‌టి నుంచి కాంగ్రెస్‌లో కొన‌సాగుతున్న విష‌యాన్ని ప్ర‌త్యేకంగా ఆయ‌న గుర్తు చేశారు. త‌న అభిప్రాయాన్ని ఇప్ప‌టికే కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు ఆయ‌న వివ‌రించారు. అయితే అధిష్టానం ఏ నిర్ణ‌యం తీసుకున్నా దానికి క‌ట్టుబ‌డి వుంటాన‌ని ఆయ‌న అన్నారు.

మొద‌టి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నాన‌ని చెప్ప‌డం వెనుక ఉత్త‌మ్ వ్యూహాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. రేవంత్‌రెడ్డి టీడీపీ నుంచి వ‌చ్చార‌ని ఆయ‌న ప‌రోక్షంగా గుర్తు చేశారు. ఉత్తమ్ పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడే రేవంత్‌ను పార్టీలో చేర్చుకోవ‌డం గ‌మ‌నార్హం. అయితే కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ చేరువయ్యారు. రేవంత్‌తో మిగిలిన నేత‌లెవ‌రూ పోటీ ప‌డ‌లేక‌పోయార‌ని చెప్పొచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?