Advertisement

Advertisement


Home > Politics - Telangana

'బండ్ల'కు మిగిలింది కాంగ్రెస్ నే అంట

'బండ్ల'కు మిగిలింది కాంగ్రెస్ నే అంట

గత ఎన్నికల టైమ్ లో సెవెనోక్లాక్ బ్లేడ్ అంటూ తెగ పాపులర్ అయిపోయాడు బండ్ల గణేష్. టీవీ చానెళ్లలో కుండ బద్దలు కొట్టి మరీ కాంగ్రెస్ వస్తుందంటూ హల్ చల్ చేసాడు. ఆ తరువాత 'సర్లే ఎన్నెన్నో అనుకుంటాం..అన్నీ జరుగుతాయా ఏంటీ?' అంటూ తనను తానే ఓదార్చుకుని ప్లేటు మార్చేసాడు. 

రాజకీయాలు మనకు వద్దు అన్నాడు. కానీ ఒకే మాట మీద వుంటే బండ్ల గణేష్ ఎందుకు అవుతాడు.

అందుకే గడచిన ఈ నాలుగేళ్లలో రకరకాలుగా వుంటూ వచ్చాడు. జై కేసిఆర్, కేటీఆర్ అన్నాడు. పవన్ నా దేవర అన్నాడు. భాజపా పెద్దవాళ్లంటే అభిమానం చూపించాడు. ఇప్పుడు అన్నీ వదిలేసి మళ్లీ కాంగ్రెస్ నే తన డెస్టినేషన్ అని ఫిక్స్ అయిపోయాడు.

ఇటీవలే రేవంత్ రెడ్డిని తన ఇంటికి పిలిచి ఫొటొలు దిగాడు. కాంగ్రెస్ గెలుపు ఖాయం అనేలా మళ్లీ సిగ్నళ్లు ఇస్తున్నాడు. ఏంటీ విషయం..మళ్లీ కేసిఆర్ పార్టీ పక్కాగా గెలుస్తుందని అంచనా వేస్తుంటే బండ్ల అటు వెళ్లక ఇటు  వెళ్లడం ఏమిటీ అని ఆరా తీస్తే అక్కడ నుంచి ఎటువంటి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. పోనీ భాజపాలోకి వెళ్దాం అంటే కేంద్రంలో పరిచయం వున్నవారంతా రిటైర్డ్ స్టేజ్ లో వున్నారు. 

అందుకే మళ్లీ కాంగ్రెస్ నే బెస్ట్ అని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో స్పోక్స్ పర్సన్ నో, ఉపాధ్యక్ష పదవినో ఆశిస్తున్నట్లు బోగట్టా. అంటే మళ్లీ ఎన్నికల ముందు టీవీ చానెళ్లలో బండ్ల ప్రత్యక్షమైన బోలెడు వినోదం పంచుతాడన్నమాట.

అవును పవన్ కు వీర భక్తుడు కదా, తెలంగాణలో జనసేనకు కీలకనేతగా ఎందుకు ఉండకూడదో? అంటే పవన్ మీద భక్తి అంతా వన్ సైడ్ లవ్వేనా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?