Advertisement

Advertisement


Home > Politics - Telangana

రేవంత్ ప్ర‌మాణ స్వీకారానికి గురువు వ‌స్తాడా?

రేవంత్ ప్ర‌మాణ స్వీకారానికి గురువు వ‌స్తాడా?

చంద్ర‌బాబును గురువుగా తెలంగాణ కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి అస‌లు అంగీక‌రించ‌రు. అలా అని ఎవ‌రైనా అంటే చెప్పుతో కొడ‌తా అంటూ రేవంత్ వార్నింగ్ ఇచ్చిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కానీ రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ నాయ‌కుడిగా కంటే, త‌మ పార్టీ నేత‌గా టీడీపీ శ్రేణులు భావిస్తుండ‌డం గ‌మ‌నార్హం. బ‌ద్ధ శ‌త్రువైన కాంగ్రెస్ తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తే, టీడీపీ శ్రేణులు సంబ‌రాలు చేసుకోవ‌డంపై స‌ర్వ‌త్రా ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్‌రెడ్డి గురువారం మ‌ధ్యాహ్నం 1.04 గంట‌ల‌కు ఎల్బీ స్టేడియంలో ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు, ఆ పార్టీకి చెందిన ముఖ్య‌మంత్రులు, మాజీ ముఖ్య‌మంత్రుల్ని హాజ‌ర‌వుతున్నార‌ని స‌మాచారం. అలాగే ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌, మాజీ సీఎం చంద్ర‌బాబునాయుడు, త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ త‌దిత‌ర ఇరుగుపొరుగు ముఖ్య నేత‌ల్ని కూడా ఆహ్వానిస్తున్న‌ట్టు కాంగ్రెస్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

తెలంగాణ‌లో కాంగ్రెస్ విజ‌యాన్ని టీడీపీ ఆస్వాదిస్తున్న నేప‌థ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడు ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి వెళ్తారా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. దేశంలో కాంగ్రెస్ బ‌ల‌ప‌డ‌డాన్ని బీజేపీ జీర్ణించుకోలేదు. తెలంగాణ‌లో కూడా కాంగ్రెస్ విజ‌యం సాధించ‌డాన్ని బీజేపీ అంత సులువుగా అంగీక‌రించే ప‌రిస్థితి లేదు. అందుకే తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం కోసం టీడీపీ ప‌ని చేయ‌డాన్ని బీజేపీ సీరియ‌స్‌గా తీసుకుంద‌నే వార్త‌లొస్తున్నాయి.

మ‌రోవైపు ఉత్త‌రాధిలో మూడు రాష్ట్రాల్లో బీజేపీ హ‌వా కొన‌సాగించ‌డంతో మ‌రోసారి కేంద్రంలో ఆ పార్టీనే అధికారంలోకి వ‌స్తుంద‌నే సంకేతాలు వెలువ‌డ్డాయి. దీంతో చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌లో వ‌ణుకు పుట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ విజ‌యంతో త‌మ‌కెలాంటి సంబంధం లేద‌ని చంద్ర‌బాబు, లోకేశ్ ప్ర‌క‌ట‌న ఇచ్చుకోవాల్సిన ద‌య‌నీయ స్థితి. ఈ ప‌రిస్థితుల్లో రేవంత్‌రెడ్డి త‌న ప్రమాణ స్వీకారోత్స‌వానికి ఆహ్వానించినా, చంద్ర‌బాబు వెళ్తారా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. వెళ్ల‌డం సంగ‌తి దేవుడెరుగు, అస‌లు ఆ ఆలోచ‌న చేయ‌డానికే భ‌య‌ప‌డుతున్నార‌ని కొంద‌రు చెబుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?