Advertisement

Advertisement


Home > Politics - Telangana

నీవెవ్వ‌డివి కొన్ కిస్కావి!

నీవెవ్వ‌డివి కొన్ కిస్కావి!

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మ‌రో సారి నోటికి ప‌ని చెప్పారు. ఈ సారి తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పై త‌న‌దైన శైలిలో విమ‌ర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేయాలా వ‌ద్దా అనేది మేము తెల్చుకుంటాము నీవెవ్వ‌డివి కొన్ కిస్కావి అంటూ బండిపై మండి ప‌డ్డారు. 

మా గురించి మా పార్టీ గురించి మాట్లాడేట‌ప్పుడు జాగ్ర‌త‌గా మాట్ల‌డాలిని, ద‌మ్ము, ధైర్యం గురించి మాట్ల‌డే ఆర్హ‌త నీకు ఎక్క‌డిది అంటూ ప్ర‌శ్నించారు. నీకు ఉన్న ద‌మ్ము ఏంటి.. ఢిల్లీ నుండి వ‌చ్చిన ద‌మ్ము త‌ప్పా నీకేముంది అంటూ ఘాటూగా విమ‌ర్శించారు. 

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజాయ్ ప్ర‌జా సంగ్రామ యాత్ర‌లో లెప్ట్ పార్టీల‌ను ఉద్దేశిస్తూ ఛాలెంజ్ చేయ‌డంతో దానికి స‌మాధానంగా సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ కౌంట‌ర్ ఇచ్చారు. మీ ప‌ని మీరు చేసుకుంటే మంచిద‌ని మా పార్టీలోకి వేలు పెడితే బాగొదంటూ కాస్తా ఘాటుగానే స‌మాధానం ఇచ్చారు.

మునుగోడు నియోక‌జ‌వ‌ర్గంలో కాస్త గెలుపోటములు ప్ర‌భావం చూపే ఓట్ల శాతం ఉంది. అందుకే బ‌హుశ బండి సంజ‌య్ లెప్ట్ పార్టీల‌ను రెచ్చ‌గొట్టి వారు ఎన్నిక‌ల్లో నిల‌బ‌డితే టీఆర్ఎస్ ఓట్లు చీలి బీజేపీకి అనుకులం అవుతుంద‌నే విమ‌ర్శించారు కాబోలు. కానీ మునుగోడులో లెప్ట్ పార్టీలు పోటీ చేయ‌కుండా టీఆర్ఎస్ కు స‌పోర్ట్ చేయ‌వ‌చ్చ‌ని పార్టీ వ‌ర్గాలు అంటూన్నారు.

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను