Advertisement

Advertisement


Home > Politics - Telangana

ఆయన ఏ సీటుకు పోటీ చేస్తారో తెలియదు ...కానీ ప్రత్యర్థి రెడీ

ఆయన ఏ సీటుకు పోటీ చేస్తారో తెలియదు ...కానీ ప్రత్యర్థి రెడీ

రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో, ఎంపీ స్థానానికి పోటీ చేస్తారో తెలియదు. ఎందుకంటే ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నారు. ఎప్పటినుంచో ఈ సంగతి చెబుతున్న గులాబీ పార్టీ అధినేత జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి అనుగుణంగా భారత్ రాష్ట్ర సమితిని (బీఆర్ఎస్) ను ప్రకటించారు. అది కార్యరూపం దాల్చే సమయం వచ్చింది. 

టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడం లాంఛనమేనని చెబుతున్నారు గులాబీ పార్టీ నాయకులు. అభ్యంతరాలకు గడువు కూడా ఈ రోజుతో పూర్తయింది. కాబట్టి పార్టీ పేరు మార్పునకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం తాపత్రయ పడుతున్న బీజేపీ కేసీఆర్ ను ఓడించగల ప్రత్యర్థిని వెతికి రెడీగా పెట్టుకుంది. 

బీజేపీ ఆలోచన కేసీఆర్ అసెంబ్లీకే పోటీ చేస్తారని. కానీ ఆయన దృష్టి జాతీయ రాజకీయాల మీద ఉంది కాబట్టి పార్లమెంటుకు పోటీ చేసి అవకాశాన్ని కొట్టిపారేయలేం. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను కేసీఆర్ పై ఎన్నికల బరిలోకి దించడానికి బీజేపీ హైకమాండ్ డిసైడ్ అయిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలోనే ఈటల రాజేందర్ కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రకటన చేశారు. కేసీఆర్ గజ్వేల్ లో పోటీ చేసినా, మరోచోట పోటీ చేసినా తాను రెడీ అంటూ ఆయన సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. 

ఈటలను పోటీకి నిలబెట్టడానికి కేంద్ర నాయకత్వం కూడా సుముఖంగా ఉందని తెలుస్తోంది. కేసీఆర్ గ‌జ్వేల్ లో పోటీ చేస్తే అక్కడ ఈటల రాజేందర్ పోటీ చేయడానికి ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే సీఎం కేసీఆర్ గజ్వేల్ నుండి పోటీ చేస్తారా లేదా నియోజకవర్గం మారతారా అన్నది కొంతకాలం కిందట చర్చ జరిగినప్పటికీ, ప్రస్తుతం దానిపైన మళ్లీ ఎవరూ మాట్లాడటం లేదు. దీంతో ఆయన గజ్వేల్ నుంచి పోటీ చేస్తారని భావిస్తున్న బీజేపీ, గజ్వేల్ లో కేసీఆర్ ను ఎదుర్కొనే బలమైన అభ్యర్థి లేకపోవడంతో ఈటల రాజేందర్ ను గజ్వేల్ నుంచి రంగంలోకి దించాలని భావిస్తున్నారు.

ఇక ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ ను ఎదుర్కోవడానికి సరైన అభ్యర్థిగా అక్కడ ఉంటారని కూడా చర్చ జరుగుతోంది. ఈటల రాజేందర్ ఇటీవల కాలంలో గజ్వేల్ నియోజకవర్గం పై దృష్టి సారించారు. తరచూ గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఈటల రాజేందర్, అక్కడ చేరికలు ప్రోత్సహిస్తూ పని మొదలు పెట్టారు. ఒకవేళ కేసీఆర్ పార్లమెంటుకు పోటీ చేసినట్లయితే ఈటలను కూడా ఎంపీగా పోటీ చేయిస్తారా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?