Advertisement

Advertisement


Home > Politics - Telangana

18 కోట్లు వితరణ.. ఏం సాధిస్తారో ఏమో?

18 కోట్లు వితరణ.. ఏం సాధిస్తారో ఏమో?

రైతులకు సాగు పెట్టుబడిగా ఆర్ధిక సాయం అందించడం అనే మంచి పథకాన్ని రైతు బంధు రూపంలో ప్రవేశపెట్టినవ్యక్తి తెలంగాణ సీఎం కేసీఆర్. ఆ రకంగా కేంద్రానికి కూడా ఆయన అలాంటి ఆలోచన అందించారు. 

ఆ రకంగా ఎంత గొప్ప రైతు బాంధవుడిగా పేరున్నప్పటికీ విమర్శలూ లేకపోలేదు. సొంత రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం పట్టించుకోరనే విమర్శ ఎటూ ఉండనే వుంటుంది. కానీ ఇప్పుడు కేసీఆర్ దేశవ్యాప్తంగా రైతు బాంధవుడనే కీర్తిని టార్గెట్ చేస్తున్నారు. అదికూడా కేవలం 18 కోట్ల రూపాయల వితరణ శీలతతో.

కేంద్రం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడే క్రమంలో అసువులు బాసిన 600 మంది రైతుల కుటుంబాలకు కేసీఆర్ చాలా ఉదారంగా సాయం అందించనున్నారు. ఆ కుటుంబాల వారిని పరామర్శించడంతోపాటు ఒక్కో కుటుంబానికి 3 లక్షల రూపాయల వంతున కేసీఆర్ ఆర్ధిక సాయం అందించనున్నారు. 

జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని రూపుదిద్దే ప్రయత్నంలో భాగంగా చేయనున్న దేశవ్యాప్త యాత్రలోనే ఈ వితరణ కూడా జరగనుంది. 

ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా.. కేసీఆర్ చేస్తున్న ఈ వితరణ వెనుక ఆయనకు జాతీయ కూటమి ఏర్పడడానికి సంబందించిన కోరికలు ఉంటే గనుక.. అవి నెరవేరుతాయో లేదో చెప్పడం కష్టం.

కూటమి కింద దేశంలోని ఇతర పార్టీలను జట్టు కట్టే కేసీఆర్ ఆలోచనకు ఈ వితరణ ప్రయోజనం పెద్దగా ఉండదు. కాంగ్రెస్ తో జట్టు కట్టి ఉన్న ప్రాంతీయ పార్టీలు దాన్ని వదలి కేసీఆర్ వైపు ఎందుకు రావాలి.. అనే బలమైన కారణం లేదు. అంత గొప్ప నమ్మకాన్ని ఆయన వారికి కలిగించలేకపోతున్నాడు.

కేసీఆర్ మాట్లాడుతున్నవి గతిలేని ఆరోపణలా.. లేక చిత్తశుద్ధితో చెబుతున్నవా అనే అనుమానం అందరిలో ఆ అనుమానం తీరేవరకు కేసీఆర్ కూటమి ప్రయత్నాలు ఫలించవు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?