Advertisement

Advertisement


Home > Politics - Telangana

ఆమె...కేసీఆర్ కంట్లో న‌లుసు!

ఆమె...కేసీఆర్ కంట్లో న‌లుసు!

రాజ‌కీయంగా మ‌హామ‌హుల్ని ఢీకొన్న‌, ఢీకొంటున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు గ‌వ‌ర్న‌ర్ తీవ్ర చికాకు తెప్పిస్తున్నారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే కేసీఆర్ కంట్లో న‌లుసులా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై త‌యార‌య్యార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. టీఆర్ఎస్ నాయ‌కుడు కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా కేసీఆర్ స‌ర్కార్ నామినేట్ చేయ‌గా, దాన్ని గ‌వ‌ర్న‌ర్ ప‌క్క‌న పెట్ట‌డంతో మొద‌లైన వివాదం... క్ర‌మంగా పెరుగుతోంది.

తెలంగాణ ప్ర‌భుత్వం, గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య స‌ఖ్య‌త‌కు చోటే లేకుండా పోతోంది. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై తాను త‌గ్గేదేలే అని రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తూనే ఉన్నారు. తాజాగా దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మ‌రోసారి ఆమె సీరియ‌స్‌గా స్పందించ‌డం చ‌ర్చ‌కు తెర‌లేచింది.

త‌మిళిసై మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రథమ పౌరురాలిగా నైతిక‌ బాధ్యతగా వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లానన్నారు. అప్పుడు కూడా అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ‌ర‌ద‌ల స‌మ‌యంలో తాను భ‌ద్రాచ‌లానికి ప‌రామ‌ర్శ‌కు వెళ్లిన స‌మ‌యంలో క‌లెక్ట‌ర్ కూడా రాలేద‌ని మండిపడ్డారు.

రాజ్‌భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ త‌న‌ను క‌లిసిన త‌ర్వాత కూడా ప్రొటోకాల్‌లో మార్పు రాలేద‌ని ఆమె గుర్తు చేయ‌డం గ‌మ‌నార్హం. తానెప్పుడూ ప్ర‌జ‌ల‌తోనే వుంటాన‌న్నారు. ప్రగతి భవన్, రాజ్‌భవన్  గ్యాప్‌పై మాట్లాడ‌న‌న్నారు. వరదలకు క్లౌడ్‌బర‌స్ట్‌ కారణం అన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తాను బర‌స్ట్ కానన్నారు.

త‌మ‌ మ‌ధ్య సంబంధాల్లో ‘స్టేట‌స్ కో’నే ఉంద‌ని చ‌లోక్తి విసిరారు. కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డానికి చిన్న అవ‌కాశం ఉన్నా త‌మిళిసై స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. రాజ‌కీయ అంశాల్ని కూడా ఆమె మాట్లాడ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. త‌మిళిసై వ్య‌వ‌హారంపై కేసీఆర్ ఇప్ప‌టి వ‌ర‌కూ నోరు తెర‌వ‌లేదు. మౌనంతోనే ఆమె ఉనికిని విస్మ‌రించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?