Advertisement

Advertisement


Home > Politics - Telangana

నా డ‌బ్బుతోనే రేవంత్‌రెడ్డి కూతురి పెళ్లి...కాద‌న‌గ‌ల‌డా?

నా డ‌బ్బుతోనే రేవంత్‌రెడ్డి కూతురి పెళ్లి...కాద‌న‌గ‌ల‌డా?

త‌న‌ను ఆంబోతుగా అభివ‌ర్ణించిన టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డిపై మంత్రి మ‌ల్లారెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. మంత్రి మ‌ల్లారెడ్డి, ఆయ‌న అల్లుడు రాజ‌శేఖ‌ర‌రెడ్డి భూక‌బ్జాదారుల‌ని, త‌మ ప్ర‌భుత్వం రాగానే అన్ని ర‌కాల ద‌ర్యాప్తులు జ‌రిపి జైలుకు పంపుతామ‌ని రేవంత్‌రెడ్డి చేసిన విమ‌ర్శ‌కు మంత్రి మ‌ల్లారెడ్డి ఘాటైన కౌంట‌ర్ ఇచ్చారు.

రేవంత్‌రెడ్డి కూతురు పెళ్లి తానిచ్చిన డ‌బ్బుతోనే చేసిన‌ట్టు మ‌ల్లారెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. ఒక‌వేళ కాదంటే యాద‌గిరి గుట్ట‌పై రేవంత్‌రెడ్డిపై ప్ర‌మాణం చేయాల‌ని మ‌ల్లారెడ్డి స‌వాల్ విసిరారు. త‌న‌ను ఆంబోతుగా అభివ‌ర్ణించ‌డంపై మ‌ల్లారెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

ఎంతో మంది వైద్యులు, ఫార్మ‌సిస్టులు, ఇంజ‌నీరింగ్ త‌దిత‌ర నిపుణుల‌ను త‌యారు చేసే తాను ఆంబోతు ఎలా అవుతాన‌ని నిల‌దీశారు. రేవంత్‌రెడ్డి బ‌తుకంతా బ్లాక్‌మెయిలే అని తూర్పార‌ప‌ట్టారు.

టీడీపీలో ఇద్ద‌రం ఉన్నామ‌న్నారు. ఒకే పార్టీలో వున్న‌ప్పుడు కూడా డ‌బ్బు కోసం త‌న‌ను రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్ చేశాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాను పాలు అమ్మాన‌ని, అలాగే విద్యా వ్యాపారం చేసి పైసాపైసా కూడ‌బెట్టిన‌ట్టు మ‌ల్లారెడ్డి చెప్పుకొచ్చారు. రేవంత్‌రెడ్డి ఏ వ్యాపారం చేసి సంపాదించాడో చెప్పాల‌ని మంత్రి మ‌ల్లారెడ్డి డిమాండ్ చేశారు. కేవ‌లం బ్లాక్ మెయిల్ చేస్తూ సంపాదించాడ‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

రేవంత్‌ డబ్బులిచ్చి టీ.పీసీసీ పదవి కొన్నారని ఆరోపించారు. రేవంత్‌ చివరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ను కూడా బ్లాక్‌మెయిల్‌ చేస్తారని ఆయ‌న హెచ్చ‌రించారు. రేవంత్‌రెడ్డి దుర్మార్గుడు, బట్టేబాజ్‌ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. రేవంత్‌ది రచ్చ బండ కాదని.. లుచ్చాబండ అని మండిప‌డ్డారు. రేవంత్‌ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్‌ అవుతుందన్నారు.  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?