Advertisement

Advertisement


Home > Politics - Telangana

బాధ‌తోనే బంధం తెంచుకుంటున్నా!

బాధ‌తోనే బంధం తెంచుకుంటున్నా!

సీనియ‌ర్ నేత మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డికి కాంగ్రెస్‌తో సుదీర్ఘ అనుబంధం తెగిపోయింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. త్వ‌ర‌లో ఆయ‌న బీజేపీలో చేర‌నున్న సంగ‌తి తెలిసిందే. టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి కాంగ్రెస్‌లో కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కుడు అఇష్టంగా కొన‌సాగుతున్నారు. అలాంటి వారిలో మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి ఒక‌రు. శ‌శిధ‌ర్‌రెడ్డి తండ్రి చెన్నారెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీఎం చేసింది.

కాంగ్రెస్‌తో మ‌ర్రి కుటుంబానికి అవినాభావ సంబంధం వుంది. అయితే తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిణామాలు మారిన నేప‌థ్యంలో అటూఇటూ పార్టీల మార్పు చోటు చేసుకుంటోంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి బీజేపీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇందులో భాగంగా ఆయ‌న కాంగ్రెస్‌కు ఇవాళ ఆయ‌న గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన‌ట్టు ప్ర‌క‌టించారు.  

బాధ‌తో కాంగ్రెస్‌తో బంధం తెంచుకుంటున్న‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు. కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించ‌డంలో విఫ‌ల‌మైంద‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ అగ్ర‌ నాయకురాలు సోనియా గాంధీకి కూడా లేఖ రాసిన‌ట్టు చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందన్నారు.

రాజీనామా నేప‌థ్యంలో నేటి నుంచి కాంగ్రెస్‌ హోంగార్డుగా ఉండటం లేదని మర్రి శశిధర్‌రెడ్డి వెల్లడించారు. రేవంత్‌రెడ్డి బ్లాక్ మెయిల్ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీలో డ‌బ్బున్న వాళ్ల మాటే చెల్లుబాటు అవుతోంద‌న్నారు. కేసీఆర్‌తో కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు లోపాయికారి ఒప్పందం చేసుకున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?