Advertisement

Advertisement


Home > Politics - Telangana

తల్లి ఒక్కటే.. తండ్రులు ఇద్దరు!

తల్లి ఒక్కటే.. తండ్రులు ఇద్దరు!

ఇది ఒక స్వామీజీగా చెప్పుకునే వ్యక్తి యొక్క బాగోతం. నీకు తండ్రులు ఒక్కరా ఇద్దరా? అని ఎవ్వరూ ఆయనను దూషించడం లేదు. ఆయనే స్వయంగా తన రికార్డుల్లో అలా నమోదు చేయించుకున్నారు. చిత్రంగా కనిపించినా అది నిజం. ఆయనకు ఉన్న రెండు పాస్ పోర్టుల సాక్షిగా నిజం. తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న రామచంద్ర భారతి వ్యవహారం ఇది!

తెరాస ఎమ్మెల్యేలకు బిజెపి ఎర వేసిందో లేదో గానీ.. ఈ కేసు విచారణలో భాగంగా కొందరు వ్యక్తులు మాత్రం పూర్తిగా నేరారోపణలతో కూరుకుపోనున్నారు. ఎరకేసు ఎలా తేలినా.. ఇతరత్రా బోలెడు నేరాలు బయటపడి.. జైలు శిక్షకు గురికాగల వారున్నారు. అలాంటి వారిలో పట్టుబడిన ముగ్గురు నిందితుల్లో ఒకరైన రామచంద్ర భారతి. 

సదరు రామచంద్ర భారతికి రెండేసి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నట్టుగా.. వారితో లోపాయికారీగా అమ్ముడుపోవడానికి బేరాలు సాగించిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాటి గురించి పోలీసులు ఒకవైపు దర్యాప్తు ప్రారంభించారు. సిట్ దర్యాప్తులో భాగంగా ఆయననుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలోని డేటాను ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా పరిశీలిస్తే ఆయనకు రెండు పాస్ పోర్టులు ఉన్న సంగతి బయటకు వచ్చింది. 

ప్రస్తుతానికి రామచంద్ర భారతి అనే పేరుతో ఎరకేసు విచారణను ఎదుర్కొంటున్న సదరు వ్యక్తికి చెందిన ఆ రెండు పాస్ పోర్టుల్లోనూ వేరే పేర్లే ఉన్నాయి. ఒక దానిలో శ్రీరామచంద్ర స్వామీజీ, మరో దానిలో భరత్ కుమార్ శర్మ అనే పేర్లతో ఈ పాస్ పోర్టులున్నాయి. రెండింటిలోనూ నున్నటి గుండు నుదుట పెద్ద విభూది పట్లు, మధ్యలో కుంకుమ బొట్టు, కాషాయ అంగవస్త్రం ధరించిన ఒకటే ఫోటోతో ఈ రెండు పాస్ పోర్టులు ఉండడం విశేషం. వీటిలో ఒకటి 2010లోను, మరొకటి 2019లోను జారీ అయ్యాయి. కర్నాటకలోనే వేర్వేరు ప్రాంతాలను అడ్రసుగా ఇచ్చారు. 

ఒక పాస్ పోర్టులోని శ్రీరామచంద్ర స్వామీజీ కి తండ్రిపేరు శ్రీమధ్వ ధర్మదత్ జీ గా పేర్కొన్నారు. మరొక పాస్ పోర్టులోని భరత్ కుమార్ శర్మ కు తండ్రి మాత్రం శ్రీకృష్ణమూర్తి వెలకుంజ అని ఉంది. తండ్రుల పేర్లకు కనీసం పొంతన కూడా లేదు. అయితే రెండు పాస్ పోర్టుల్లోనూ తల్లి పేరు మాత్రం సరస్వతి వెలకుంజ అని ఒకేపేరుండడం విశేషం.

అందుకే.. నిందితుడు రామచంద్ర భారతికి తల్లి ఒకరు, తండ్రులు ఇద్దరు అన్నట్టుగా రికార్డులు ఉన్నాయని పోలీసులు విస్తుపోతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?