Advertisement

Advertisement


Home > Politics - Telangana

రేవంత్ కేబినెట్‌లో ఆ జిల్లాల‌కు ద‌క్క‌ని చోటు!

రేవంత్ కేబినెట్‌లో ఆ జిల్లాల‌కు ద‌క్క‌ని చోటు!

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్‌రెడ్డి కాసేప‌ట్లో ప్ర‌మాణం స్వీకారం చేయ‌నున్నారు. అలాగే మంత్రులు కూడా ఆయ‌న‌తో పాటు ప్ర‌మాణం చేయ‌నున్నారు. కొన్ని జిల్లాల నుంచి ఇద్ద‌రేసి చొప్పున మంత్రులుగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. మ‌రి కొన్ని జిల్లాల్లో ఏ ఒక్క‌రికీ మంత్రి ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో  భట్టి‌‌ విక్రమార్క , ఉత్తమ్ కుమార్ రెడ్డి ,శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి  కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావుల‌కు చోటు ద‌క్కింది.

వీరిలో ఖ‌మ్మం జిల్లా నుంచి ఏకంగా ముగ్గురికి మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాకు చెందిన  భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల‌కు స్థానం క‌ల్పించ‌డం విశేషం. భ‌ద్రాచ‌లం మిన‌హాయించి మిగిలిన 9 చోట్ల కాంగ్రెస్‌, ఆ పార్టీ బ‌ల‌ప‌రిచిన నేత‌లే గెలుపొందారు. ఇక మిగిలిన జిల్లాల విషయానికి వ‌స్తే... వ‌రంగ‌ల్ నుంచి   సీతక్క, కొండా సురేఖల‌కు చోటు ద‌క్కింది. ఇద్ద‌రికీ మ‌హిళ‌ల‌కే అవ‌కాశం ఇవ్వ‌డం విశేషం.

అలాగే  పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు (క‌రీంన‌గ‌ర్‌),  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (న‌ల్గొండ‌), జూప‌ల్లి కృష్ణారావు (మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌), దామోద‌ర రాజ‌న‌ర్సింహా (మెద‌క్‌)ల‌కు మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి. ఇక మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌ని జిల్లాల గురించి తెలుసుకుందాం. హైదరాబాద్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి ఎవ‌రికీ అవ‌కాశం ద‌క్క‌లేదు. వీటిలో కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించ‌క‌పోవ‌డాన్ని గ‌మ‌నించొచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?