Advertisement

Advertisement


Home > Politics - Telangana

రేవంత్ అను నేను.. సీఎంగా!

రేవంత్ అను నేను.. సీఎంగా!

ఎట్టకేలకు తెలంగాణ సీఎంపై కాంగ్రెస్ అధిష్టానం కీలక ప్రకటన చేసింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఉదయం నుండి సీనియర్ నేతలతో సుదీర్ఘ మంతనాలు తర్వాత భ‌ట్టి విక్రమార్క, ఉత్తమ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశంలో ప్రకటించారు.

కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. నిన్న‌టి సీఎల్పీ స‌మావేశంలో ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేత‌గా ఎన్నుకున్నార‌ని.. ఈ నెల 7న సీఎంగా రేవంత్ రెడ్డి ప్ర‌మాణ‌స్వీకారం చేస్తార‌ని ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ నేతలు అందరూ టీమ్ వర్క్ చేస్తారని.. సీనియ‌ర్ల‌ అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ అధిష్టానం రేవంత్‌ను సీఎంగా ప్ర‌క‌టించ‌డంతో తెలంగాణ రెండ‌వ సీఎంగా రేవంత్ రెడ్డి చ‌రిత్ర‌కెక్కానున్నారు. పీసీసీ చీఫ్ సీఎం కాలేర‌నే అన‌వాయితీని ఆయ‌న బ‌ద్ద‌లు కొట్టానున్నారు. కాగా సీఎం అభ్యర్థి ప్రకటన వెలువడే కంటే కొద్ది సమయం ముందే... రేవంత్ రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపు రావటంతో.. హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?