Advertisement

Advertisement


Home > Politics - Telangana

ఎవనిపాలయ్యిందిరో తెలంగాణ...!

ఎవనిపాలయ్యిందిరో తెలంగాణ...!

జాతీయ పార్టీ ఏర్పాటు దిశ‌గా ముందుకు సాగుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ పెట్టిన త‌ర్వాత దేశ వ్యాప్తంగా ప‌ర్య‌టించ‌డం కోసం సొంతంగా విమానం కొనుగోలు చేయ‌నున్న‌ట్లు వ‌స్తున్నా వార్త‌ల‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి త‌న‌దైన శైలిలో స్పందించారు.

అమరవీరుల కుటుంబాలను కలిసింది లేదు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఏ నాడు పరామర్శించ లేదు. ప్రగతి భవన్ ఏసీ గదిని వీడింది లేదు... ఫాంహౌస్ దాటింది లేదు. ఇప్పుడు దేశదిమ్మరిలా తిరగడానికి విమానం కొంటున్నాడట! ఎవనిపాలయ్యిందిరో తెలంగాణ...!! అంటూ కేసీఆర్ ను ఉద్దేశిస్తూ ట్వీట‌ర్ లో రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు.

కాగా త‌ర్వ‌లో జ‌ర‌గ‌బోయో మునుగోడు ఉపఎన్నికే తెలంగాణ‌లోని అన్ని రాజ‌కీయ పార్టీల‌ టార్గెట్ గా ఉంది.. కాంగ్రెస్ కు మునుగోడులో చెప్పుకో ద‌గ్గ ఓట్లు వ‌స్తే దాని ప్ర‌భావం వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చూపుతుంది. అలాగే బీజేపీకి కూడా మునుగోడు ఉప ఎన్నిక చాల అవ‌స‌రం ఎలాగైనా తెలంగాణ‌లో పాగా వేయ‌ల‌న్నా బీజేపీ కోరిక నెర‌వేరాలంటే మునుగోడులో గెలవాలి. దేశ రాజ‌కీయాల్లోకి వెత్తున్నా కేసీఆర్ కు కూడా మునుగోడు ఉప‌ ఎన్నిక విజ‌యం చాల‌ ఆవ‌స‌రం.

ద‌స‌రా పండుగ రోజు కేసీఆర్ జాతీయ పార్టీని ప్ర‌క‌టించబోతున్న‌ట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీ పేరుతో పాటు, దేశ వ్యాప్తంగా రాష్ట్రాల వారిగా కో- ఆర్డినేట‌ర్ల‌ను ప్ర‌క‌టించాబోతున్న‌ట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?