Advertisement

Advertisement


Home > Politics - Telangana

కేసీఆర్‌కు రేవంత్ ప‌రామ‌ర్శ‌

కేసీఆర్‌కు రేవంత్ ప‌రామ‌ర్శ‌

అనారోగ్యంతో యశోద ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ప‌రామ‌ర్శించారు. కేసీఆర్‌కు ఆప‌రేష‌న్ పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేసీఆర్‌కు మెరుగైన చికిత్స అందించాల‌ని ఇప్ప‌టికే సీఎం ఆదేశాలిచ్చారు.

ఈ క్ర‌మంలో య‌శోద ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి స్వ‌యంగా ప‌రామ‌ర్శించ‌డం ఆస‌క్తిదాయకం. కేసీఆర్‌, రేవంత్ మ‌ధ్య రాజ‌కీయ వైరం దాటి వ్య‌క్తిగ‌త శ‌త్రుత్వం కొన‌సాగుతోంది. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా కేసీఆర్ స‌ర్కార్ ప‌ట్టుకుంది. రేవంత్‌ను జైలుకు పంపింది. అలాగే 2018 ఎన్నిక‌ల్లో కొడంగ‌ల్‌లో రేవంత్‌ను ప‌ట్టుప‌ట్టి ఓడించారు.

కేసీఆర్‌పై ప‌రుష ప‌ద‌జాలంతో రేవంత్ విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఎన్నిక‌ల ప్ర‌చారంలో క‌నీసం రేవంత్‌రెడ్డి పేరు ప్ర‌స్తావించ‌డానికి కూడా కేసీఆర్ ఇష్ట‌ప‌డేవారు కాదు. దీన్ని బ‌ట్టి రేవంత్ అంటే కేసీఆర్ ఎంత‌గా ర‌గిలిపోయే వారో అర్థం చేసుకోవ‌చ్చు. రేవంత్‌, బీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య విమ‌ర్శ‌ల హ‌ద్దులు దాటి వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల వ‌ర‌కూ వెళ్లింది. రాజ‌కీయ పోరులో అంతిమంగా రేవంత్‌రెడ్డి విజ‌యం సాధించారు.

కేసీఆర్‌ను ముఖ్య‌మంత్రి హోదాలో ప‌రామ‌ర్శించి, త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాక్షించ‌డం విశేషం. రేవంత్‌రెడ్డి ప‌రామ‌ర్శించిన స‌మ‌యంలో కేసీఆర్ వ‌ద్ద కేటీఆర్‌, హ‌రీశ్‌రావు, క‌విత‌, ఎర్ర‌బ‌ల్లి ద‌యాక‌ర్‌రావు, కొత్త‌కోట ప్ర‌భాక‌ర్‌రెడ్డి త‌దిత‌రులు ఉన్నారు. అలాగే రేవంత్‌రెడ్డి వెంట మంత్రులు సీత‌క్క‌, పొన్నం ప్ర‌భాక‌ర్ ఉన్నారు.

ప‌రామ‌ర్శ అనంత‌రం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకుని అసెంబ్లీకి రావాల‌ని ఆకాంక్షించారు. మాజీ ముఖ్య‌మంత్రి, సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త అయిన కేసీఆర్ స‌ల‌హాలు, సూచ‌న‌లు అవ‌స‌ర‌మ‌న్నారు. స‌మ‌స్య‌ల‌పై కేసీఆర్ సూచ‌న‌లు ఇచ్చి మంచిపాల‌న‌ను అందించేందుకు దోహ‌ద‌ప‌డేందుకు ఆయ‌న ఆరోగ్యంగా రావాల‌ని కోరారు. కేసీఆర్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని ర‌కాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తుంద‌న్నారు.  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?