Advertisement

Advertisement


Home > Politics - Telangana

భ‌ట్టి, ఉత్త‌మ్ టార్గెట్‌... అదృశ్య శ‌క్తి ఎవ‌రు?

భ‌ట్టి, ఉత్త‌మ్ టార్గెట్‌... అదృశ్య శ‌క్తి ఎవ‌రు?

సోష‌ల్ మీడియాలో తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు భ‌ట్టి విక్ర‌మార్క‌, ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డిల‌ను సోష‌ల్ మీడియాలో టార్గెట్ చేశారు. వాళ్లిద్ద‌రిపై కుట్ర‌పూరిత ట్రోలింగ్ జ‌రుగుతున్న‌ట్టు ఆ నాయ‌కుల అనుచ‌రులు వాపోతున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన నేప‌థ్యంలో, రేవంత్‌రెడ్డితో పాటు భ‌ట్టి, ఉత్త‌మ్ కూడా సీఎం ప‌ద‌విని ఆశించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రేవంత్ వైపు మొగ్గు చూపింది.

దీంతో గురువారం రేవంత్‌రెడ్డి తెలంగాణ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. సీఎం ప‌ద‌వికి సంబంధించిన ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. క‌థ సుఖాంత‌మైంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో భ‌ట్టి విక్ర‌మార్క‌, ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డిల‌పై ఉద్దేశ పూర్వ‌కంగానే దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని వారి అభిమానులు వాపోతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్‌తో గ‌తంలో వాళ్లిద్ద‌రు భేటీ అయిన ఫొటోను తెర‌పైకి తీసుకొచ్చి, ఇలాంటి వాళ్లు డిప్యూటీ సీఎంలు అయితే కాంగ్రెస్ ప్ర‌భుత్వం అంతే సంగ‌తుల‌నే ట్రోలింగ్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

తెలంగాణ‌లో టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారికి మాత్ర‌మే ప్ర‌భుత్వంలో ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టే క్ర‌మంలో, నిజ‌మైన కాంగ్రెస్ వాదుల‌ను బ‌ద్నాం చేయ‌డానికి పెద్ద కుట్ర జ‌రుగుతోంద‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎన్నిక‌ల‌కు ముందు  కూడా ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డితో పాటు మ‌రికొంద‌రు ముఖ్య నేత‌లంతా బీఆర్ఎస్‌లోకి వెళుతున్న‌ట్టు ప్ర‌చారం చేయ‌డం వెనుక‌, త‌మ‌కు అడ్డు తొల‌గించుకోవాల‌నే కీల‌క నాయ‌కుడి హ‌స్తం వుంద‌ని బాధిత కాంగ్రెస్ నేత‌లు ఆరోపించారు.

ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌రుణంలో ఉద్దేశ పూర్వ‌కంగానే బీఆర్ఎస్ నేత‌ల‌తో భ‌ట్టి, ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి స‌న్నిహితంగా ఉన్నార‌నే ప్ర‌చారం చేసి, త‌ద్వారా వాళ్లిద్ద‌రిని రాజ‌కీయంగా అడ్డు తొల‌గించుకునేందుకు అదృశ్య శ‌క్తి ప‌న్నిన కుట్ర‌గా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలాగైతే కాంగ్రెస్ మార్క్ రాజ‌కీయాల పుణ్య‌మా అని ప్ర‌జ‌లిచ్చిన అవ‌కాశాన్ని కూడా స‌ద్వినియోగం చేసుకోలేని ప్ర‌మాదం పొంచి వుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?