Advertisement

Advertisement


Home > Politics - Telangana

తెలంగాణ ఇంత ఘోరమా?

తెలంగాణ ఇంత ఘోరమా?

ఆంధ్ర-తెలంగాణల మధ్య గత అయిదేళ్లుగా పోలిక వుంటూనే వస్తోంది. ఆంధ్ర పరిస్థితి బాలేదు అనే అర్థం వచ్చేలా తెలంగాణ పెద్దలు మాట్లాడిన సందర్భాలు వున్నాయి. కానీ ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆర్కే కుండ బద్దలు కొట్టారు. ఆయన మాటల్లోనే…

‘’....‘ అప్పుల కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదు. ప్రభుత్వం చెల్లించవలసిన బిల్లులు వేల కోట్లలో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పరిస్థితులలో ‘మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె’ అన్నట్టుగా కేసీఆర్‌ వ్యవహరించడం ఆక్షేపణీయంగా ఉంది...’’

ఇలాంటి విషయాలు వివరిస్తూ ఇప్పటి వరకు సదరు మీడియాలో వార్తలు కనిపించలేదు. ఏ నెలా ఫస్ట్ వీక్ లో జీతాలు అందలేదు అనే వార్తలు కనిపించిన దాఖలా లేదు. అలాగే వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో వున్నాయి అని చాటిన వైనమూ లేదు. ఎప్పుడూ ఆంధ్రలో జీతాల గోల, అప్పుల వైనం తప్ప తెలంగాణ వ్యవహరాలు తెరపైకి తెచ్చే ప్రయత్నమూలేదు.

ఇప్పుడు ఉన్నట్లుండి ఈ రివర్స్ గేర్ తీసుకున్నారు. అది కూడా వార్తల్లో కన్నా విశ్లేషణల్లోనే అధికంగా కనిపిస్తోంది. మరి తెలంగాణలోనూ, ఆంధ్రలోనూ ఒకటే పరిస్థితి వుంటే జగన్ ను తూర్పార పడుతున్న రేంజ్ లో కేసిఆర్ మీదకు కాలు దువ్వడం లేదెందుకో? నిజంగానే తెలంగాణలో ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా వుందా? 

ఆ మాటకు వస్తే తెలంగాణ, ఆంధ్ర అన్నదే కాదు దేశంలోని అనేక రాష్ట్రాలు, అలాగే కేంద్రం పరిస్థితి కూడా ఇలాగే వుందన్నది పచ్చి వాస్తవం. ఎటొచ్చీ మనకు ఎవరిపై కోపం వుంటే వారి వ్యవహారాలు బయటకు తెస్తాం. మిగిలిన వారివి దాస్తాం. అంతే తేడా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?