Advertisement

Advertisement


Home > Politics - Telangana

కేసీఆర్ వ‌ద్ద‌నుకున్న ఆ ముగ్గురు.. నేడు మంత్రులు!

కేసీఆర్ వ‌ద్ద‌నుకున్న ఆ ముగ్గురు.. నేడు మంత్రులు!

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌ద్ద‌నుకున్న ఆ ముగ్గురు నేత‌లు నేడు కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రులుగా బాధ్య‌తలు చేప‌ట్టారు. కాలం క‌లిసి వ‌స్తే, అదృష్టం వ‌రిస్తుంద‌నేందుకు ఇదే నిద‌ర్శ‌నం. త‌మ‌ను కేసీఆర్ ప‌క్క‌న పెట్ట‌డాన్ని స‌హించ‌లేక‌, ఎన్నిక‌ల‌కు కొంత కాలం ముందు ఆ ముగ్గురు కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌పై ప్ర‌జ‌లు ఆద‌ర‌ణ చూప‌డంతో నేడు ఆ ముగ్గురు నేత‌లు మంత్రుల‌య్యారు.

రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ఆ ముగ్గురు నేత‌లు... ఖ‌మ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు చెందిన జూప‌ల్లి కృష్ణారావు. జూప‌ల్లి కృష్ణారావు (కొల్లాపూర్‌), తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు (ఖ‌మ్మం), పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి (పాలేరు) నుంచి ప్ర‌జల ఆశీస్సుల‌తో విజ‌యం సాధించారు.

బీఆర్ఎస్ నుంచి ఈ ముగ్గురు నేత‌లు టికెట్లు ఆశించి భంగ‌ప‌డ్డారు. ముఖ్యంగా పాలేరు, కొల్లాపూర్‌ల‌లో కాంగ్రెస్ త‌ర‌పున గెలుపొంది, ఆ త‌ర్వాత బీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల‌కే కేసీఆర్ టికెట్లు ఇచ్చారు. దీన్ని అక్క‌డ టికెట్లు ఆశించిన తుమ్మ‌ల‌, జూప‌ల్లి  జీర్ణించుకోలేక‌పోయారు. పొంగులేటిది ఇదే బాధ‌.

ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ త‌గ్గింద‌నే కార‌ణంతో కేసీఆర్ ప‌క్క‌న పెట్టారు. కేసీఆర్‌తో పొంగులేటి ఫైట్ ఆత్మ గౌర‌వానికి సంబంధించింది. ఏది ఏమైనా త‌మను కాద‌న్న కేసీఆర్ పార్టీ అభ్య‌ర్థుల్నే ఓడించి, నేడు మంత్రులుగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం విశేష‌మ‌నే చెప్పాలి. ప్ర‌జాద‌ర‌ణ కోల్పోయింది బీఆర్ఎస్సే త‌ప్ప‌, తాము కాద‌ని ఈ నేత‌లు నిరూపించారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?